AP Volunteers: వైసీపీ ఒత్తిడితో వాలంటీర్ల రాజీనామా.. రిజైన్ చేయకపోతే బెదిరిస్తున్నారా?

AP Volunteers: ఏపీలో ఎన్నికల వేళ వాలంటీర్ల అంశం రచ్చ రచ్చ అవుతోంది. ఎన్నిలు ముగిసే వరకు వాలంటీర్లతో పింఛన్లు పంపిణీ చేయించవద్దని ఈసీ ఆదేశించింది. దీంతో ఏపీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. పింఛను ఆపిన పాపం మీదంటే మీది అంటూ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు.

మరోవైపు వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తుండడం కూడా రాజకీయంగా కీలకంగా మారింది. తాము ప్రజలకు సేవ చేస్తుంటే నిందలు వేస్తున్నారని చెప్పి రిజైన్లు చేస్తున్నారు. చంద్రబాబు, పవన్, బీజేపీ నేతల తీరుకు నిరసనగా రాజీనామా చేస్తున్నామని అంటున్నారు. పెన్షన్లు ఇవ్వకుండా తమను అడ్డుకోవడం కలిచి వేసిందని చెప్పుకొస్తున్నారు. పింఛన్ల కోసం వృద్ధులు ఫోన్లు చేస్తున్నారని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తాము పంపిణీ చేసే పరిస్థితి లేదంటున్నారు. వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు చేయడం రాజకీయ రంగు పులుముకుంది. వాలంటీర్లపై టీడీపీ ఈసీకి ఫిర్యాదు చేసినందువల్లే రాజీనామాలు చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. వాలంటీర్లను అడ్డుపెట్టుకుని వైసీపీ రాజకీయాలు చేస్తోందని టీడీపీ కౌంటర్ ఇస్తోంది.

మరోవైపు చేసిందంతా చేసి ఇప్పుడు టీడీపీ నేతలు కబుర్లు చెబుతున్నారని వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. చంద్రబాబును దేవుడు క్షమించడని మంత్రి బొత్స అంటున్నారు. వికలాంగులకు, పెన్షనర్లకు ఏం సమాధానం చెప్తారు? ప్రతిదీ రాజకీయం చేస్తారా? మానవత్వం ఉండొద్దా అని ప్రశ్నిస్తున్నారు. ఇన్ని నెలలు వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేస్తే అప్పుడు రాని ఇబ్బంది ఇప్పుడెందుకు వచ్చిందని నిలదీస్తున్నారు.

వాలంటీర్ల విధులపై ఈసీ ఆంక్షలు విధించడంతో వైసీపీ దాన్ని పెన్షన్ పంపిణీకి లింక్ పెట్టి టీడీపీపై పై ఆరోపణలు చేస్తుంటే.. టీడీపీ కూడా అంతే స్థాయిలో రివర్స్ అటాక్ చేస్తోంది. అయితే, వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాల్లో మరో అంశం తెరపైకి వచ్చింది. వాలంటీర్లు స్వచ్చందంగా కాకుండా అధికారపార్టీ నాయకుల ఒత్తిడితో రాజీనామా చేస్తునట్టు తేలింది. కొన్ని చోట్ల అధికార పార్టీనేతల ఒత్తిళ్లకు తలొగ్గి రాజీనామా చేస్తుంటే.. మరికొన్ని చోట్ల మాత్రం రాజీనామాకు ససేమేరా అంటున్నారు.

ఉమ్మడి కృష్ణా జిల్లాలో 9,600 మంది వాలంటీర్లు ఉన్నారు. అందులో 880 మంది ఇప్పటి వరకూ రాజీనామా చేశారు. మచిలీపట్నం నియోజకవర్గంలో పేర్ని నాని బెదిరింపులకు 860 మంది తలొగ్గగా… మిగిలిన నియోజకవర్గాల్లో 20 మంది వరకూ రాజీనామా చేశారు. ఎన్టీఆర్‌ జిల్లాలో 10,418 మంది వలంటీర్లు ఉంటే.. కేవలం ఆరుగురే రాజీనామా చేశారు. అధికారపార్టీ నుంచి పెద్ద ఎత్తున ఒత్తిళ్లు వచ్చినా.. వారు తలొగ్గలేదు. జీతం బకాయిలు వైసీపీనే చెల్లిస్తుందని నేతలు చెబుతున్నా.. వలంటీర్లు నమ్మడం లేదు. అంతేకాదు.. వైసీపీ నేతల ఒత్తిళ్లతో నరసరావుపేటలో కొందరు వాలంటీర్లు రాజీనామా చేశారు. కానీ, వారి దగ్గర ఉన్న మొబైల్‌, వేలి ముద్రల స్కానింగ్‌ పరికరాలు మాత్రం ఇవ్వలేదు. మూడు నెలలుగా పెండింగ్ లో ఉన్న జీతం ఇస్తేనే డివైజ్ లు ఇస్తామని తేల్చి చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Sharmila: జాబు రావాలంటే జగన్ పోవాలి.. వైరల్ అవుతున్న షర్మిల సంచలన వ్యాఖ్యలు!

YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నవ సందేహాలు పేరిట వైయస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగంగా లేఖ రాశారు ఈ లేఖ ద్వారా గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన...
- Advertisement -
- Advertisement -