Phd Bharati: వైరల్ అవుతున్న పీహెచ్డీ భారతి సంచలన వ్యాఖ్యలు!

Phd Bharati: అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నాగులగుడ్డంకు చెందినటువంటి సాకే భారతి స్కూల్ పనులు చేసుకుంటూ చదువుపై ఆసక్తితో తన భర్త ప్రోత్సాహంతో ఏకంగా ఎస్కే యూనివర్సిటీలో పిహెచ్డి చేసి ఒక్కసారిగా సంచలనంగా మారారు. ఇలా ఒక పేదింటి మహిళ కూలి పనులకు వెళ్తూ ఉండడానికి కూడా సరైన నిలువ నీడ లేకుండా చదువుపై ఆసక్తితో కొన్ని కిలోమీటర్ల దూరం నడుస్తూ ఇలా పిహెచ్డి చేశారు అనే విషయం తెలియడంతో ఎంతోమంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

నిన్నటి వరకు ఎవరికీ తెలియని ఈ సాకే భారతి ఒక్కసారిగా సంచలనంగా మారారు.ఈ క్రమంలోనే ఎంతోమంది మీడియా ప్రతినిధులు రాజకీయ నాయకులు ఉన్నత విద్యావేత్తలు సాకే భారతిని కలిసి ఆమెకు ఘనంగా సన్మానం చేస్తున్నారు.ఈ క్రమంలోనే సాకే భారతికి సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈమె పరిస్థితి చూసి చాలామంది తనకు సహాయం చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు.

 

కనీసం ఉండటానికి కూడా సరైన ఇల్లు లేకపోవడంతో ఈమె ఎలాంటి పరిస్థితులలో చదువును ముందుకు కొనసాగించిందో అర్థమవుతుంది. ఈ క్రమంలోనే ఓ మీడియా సమావేశంలో భాగంగా సాకే భారతి మాట్లాడుతూ తాను కాలేజీకి వెళ్తూ కాలేజ్ లేని రోజులలో కూలి పనులకు వెళుతూ పి.హెచ్.డి పూర్తి చేశానని తన పీహెచ్డీ పట్టాను అందరికీ చూపించారు.

 

చదువులో ఇంత ఉన్నతంగా సాధించిన మిమ్మల్ని సత్కరించడానికి ఎంతో మంది ముందుకు వస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుందని ప్రశ్నించడంతో ఇప్పటివరకు నాకు వాళ్ళు ఎవరు అనే విషయం కూడా తెలియదు కానీ నేను చదువుకున్నానన్న విషయం తెలియడంతో అందరూ ఇక్కడికి వచ్చి నన్ను సన్మానిస్తున్నారని ఈమె తెలిపారు. ఇక ఉండటానికి ఇల్లు లేదు ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి సహాయం అందిందా అని ప్రశ్నించడంతో తనకు సీఎం గారి నుంచి ఎలాంటి సహాయం అందలేదని తెలిపారు. ఆర్డిటి వాళ్ళు తనకు ఇల్లు ఇస్తారని చెప్పగా అప్పటికే కలెక్టర్ దగ్గరకు ఇల్లు ప్రపోజల్ వెళ్లడంతో పనులు జరుగుతున్నాయని ఇప్పటివరకు నాకైతే ఎలాంటి సహాయం అందలేదంటూ భారతి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: జగన్ ను ముంచిన సలహాదారుడు అతనేనా.. వృద్ధాప్య పెన్షన్ విషయంలో ముంచింది ఎవరంటే?

CM Jagan: 2014 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేసరికి రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్ కేవలం 200 రూపాయలు మాత్రమే ఉండేది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే రూ. వెయ్యి చేశారు. మళ్లీ...
- Advertisement -
- Advertisement -