PM Modi: 7200 వజ్రాలతో ప్రధానమంత్రి మోదీ చిత్రపటం.. ఈ చిత్ర పటం కోసం ఏకంగా అన్ని రూ.కోట్ల ఖర్చా?

PM Modi: ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రపంచంలోనే ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన చేసే పనులు, ఆయన తీసుకునే నిర్ణయాలు ఆయనకి రోజు రోజుకి అభిమానుల్ని పెంచుతూనే ఉన్నాయి. ఆయన హవా భారత దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం కొనసాగుతుంది. చాలామంది భారత ప్రధాని మోడీకి పెరుగుతున్న ఆదరణ చూసి అభిమానులుగా మారిపోయారు. ఇంతకీ విషయం ఏమిటంటే సెప్టెంబర్ 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 73 వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు.ఈ పుట్టినరోజు ని గ్రాండ్ గా చేయాలని బీజేపీ పార్టీ సైతం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ వీరాభిమాని ఒకరు ఏకంగా తనుకు ప్రధానిపై ఉన్న అభిమానం, ఇష్టం ఎంత ఖరీదైనదో చూపించాలనుకున్నాడు. అందుకు ఏకంగా 7200 వజ్రాలతో నరేంద్ర మోడీ ఫోటోని రూపొందించాడు సూరత్ కి చెందిన ఒక నరేంద్ర మోడీ అభిమాని. ఈయన తయారు చేసిన ఈ చిత్రపటాన్ని త్వరలో రాబోయే ప్రధానమంత్రి పుట్టిన రోజు సందర్భంగా ఆయనకి ఇవ్వాలనుకుంటున్నారు విపుల్.

విపుల్ వృత్తిరీత్యా ఆర్కిటెక్చర్ ఇంజనీర్ ఇప్పటివరకు చాలామంది ఇళ్లల్లో ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేసినప్పటికీ కొంతకాలం తర్వాత తనకు ఏదైనా విభిన్నంగా చేయాలనుకోవడంతో వజ్రాలతో వివిధ రకాల పెయింటింగ్ లను వేయటం ప్రారంభించాడు. సూరత్ వజ్రాల నగరంగా ప్రసిద్ధి చెందింది కాబట్టి విపుల్ వజ్రాలతోనే ప్రధాని చిత్రపటాన్ని తయారు చేయాలనుకున్నాడు. దాదాపు మూడున్నర నెలలు కష్టపడి ఆ చిత్రపటాన్ని తయారు చేశాడు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ భార్యకు వజ్రాన్ని గిఫ్ట్ గా ఇవ్వడం ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడు ఈ ఆర్కిటెక్చర్. ఇదే విషయాన్ని అతను బహిరంగంగా చెప్పాడు. నరేంద్ర మోడీ తన 72 ఏళ్ల జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భముగా 7,200 వజ్రాలతో ఈ చిత్రపటాన్ని తయారు చేశానని చెప్పుకొచ్చారు విపుల్. అయితే దీనికోసం ఆయన ఎంత ఖర్చు పెట్టారు అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -