PM Narendra Modi: విభజన గాయాన్ని కెలుకుతున్న మోదీ.. ఏపీకి అన్యాయం జరిగిందని ఇప్పుడు గుర్తొచ్చిందా?

PM Narendra Modi: తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయి దాదాపు పది సంవత్సరాలు అవుతుంది ఇలా పది సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన గురించి మాట్లాడటంతో ప్రస్తుతం ఈ విషయాలు కాస్త చర్చలకు కారణమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాలు కూడా ఈ విభజన పట్ల సంతోషంగా లేవని ఎవరు కూడా సంబరాలు చేసుకోలేదని మోడీ తెలిపారు.

ఇలా పదేళ్ల తర్వాత మానిపోతున్నటువంటి గాయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నారనే విషయం ప్రస్తుతం చర్చలకు కారణమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన యుపిఏ హయాంలో జరిగినప్పటికీ ప్రజలు మాత్రం సంతోషంగా లేరని తెలిపారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ఈ వ్యాఖ్యల పై పలువురు స్పందిస్తూ రెండు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా లేరనడం వాస్తవం కాదు.

తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు బాధపడినప్పటికీ ఈ విభజనను వ్యతిరేకించినప్పటికీ తెలంగాణ వాళ్లు మాత్రం సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన ఎప్పుడూ కూడా రెండు రాష్ట్రాలు ఆమోదయోగంగా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు జరిగితే మంచిదని కానీ ఈ రాష్ట్రాల విభజన సమయంలో మాత్రం ప్రజల సంతోషంగా లేరని తెలిపారు.

ఉన్నఫలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన గురించి ఈయన మాట్లాడటంతో ఈయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విభజన విషయంలో ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరిగిందని నరేంద్ర మోడీ కనక భావిస్తే రాష్ట్రానికి తగిన న్యాయం చేసే స్థానంలో ప్రస్తుతం నరేంద్ర మోడీ ఉన్నారు. 10 సంవత్సరాల క్రితమే ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ఇప్పటివరకు ఆహామీ నెరవేర్చలేదనే విషయాన్ని గుర్తించుకుంటే మంచిది అంటూ పలువురు మోడీ వ్యాఖ్యలపై కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -