Pawan – Sharmila: ఓడితే పవన్, షర్మిల పొలిటికల్ కెరీర్ కు శుభం కార్డ్.. ఆశించిన ఫలితాలు రావడం సాధ్యమా?

Pawan – Sharmila: ఏపీలో నెల రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఫలితాలు వెలువడిన తర్వాత ఎవరి భవిష్యత్ ఏంటో తేలిపోతుంది. అయితే, ఈ ఎన్నికలు జనసేన అధినేత పవన్ కల్యాణ్, కాంగ్రెస్ చీఫ్ షర్మిలకు చాలా కీలకం. ఇద్దరు నేతలు కూడా ప్రజల్లో అంతో ఇంతో చరష్మా ఉన్న నేతలే. పవన్ కు అశేషమైన అభిమానులు ఉన్నారు. షర్మిల విషయానికి వస్తే.. మొండిపట్టుదలగల నాయకురాలిగా ఆమెకు గుర్తింపు ఉంది.

పవన్ పార్టీ పెట్టి పదేళ్లు అవుతున్నా.. చట్ట సభల్లో నెంబర్ ప్రాతినిథ్యం లేదు. 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చి ఓటమికి దూరంగా ఉన్నారు. టీడీపీ గెలుపును తన గెలుపుగా చెప్పుకున్నారు. అయితే, ప్రత్యేకహోదా సహా ప్రభుత్వ తీరులో టీడీపీని వ్యతిరేకించి ఆయన ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చారు. 2019 ఎన్నికల్లో బీఎస్పీ, కమ్యునిస్టులతో కలిసి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. కనీసం పవన్ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఒక్కటి కూడా గెలవలేదు. రాజోలులో జనసేన అభ్యర్థి గెలిచినా ఆయన కొన్ని రోజులకే వైసీపీలో చేరిపోయారు. దీంతో.. పవన్ ఐదేళ్ల కష్టం వృధా అయింది. అప్పటి నుంచి పవన్ పై చాలా మంది సెటైర్లు వేశారు. ప్రసంగాలకు తప్ప పనికి పనికిరాడని వైసీపీ నేతలు ఆడేసుకున్నారు. దీంతో.. పవన్ ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో తనతో పాటు తన పార్టీ నేతల ప్రాతినిథ్యం ఉండాలని భావించారు. ఈ సారి గెలవకపోతే.. పార్టీ నుంచి గౌరవమైన స్థానాలను గెలిపించుకోలేకపోతే.. పవన్ ను ఫ్యాన్స్ నమ్మే అవకాశాలు తగ్గిపోతాయి. అంతేకాదు.. అతి పెద్ద సామాజిక వర్గమైన కాపులు.. అంటే సొంత సమాజిక వర్గం కూడా పవన్ వైపు లేదనే సంకేతాలు పొలిటికల్ సర్కిల్స్‌లోకి వెళ్తాయి. అది పవన్ పొలిటికల్ ఫ్యూచర్‌కు ప్రమాదం.

ఇక, షర్మిల విషయానికి వచ్చినట్టు అయితే.. జగన్ జైలుకు వెళ్లినపుడు పాదయాత్ర చేసిన వైసీపీలో ఆత్మవిశ్వాసం పెంచారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైసీపీ కోసం బస్సు యాత్ర చేశారు. గతసారి వైసీపీ గెలుపులో తాను కీలకం అని ఆమె బావిస్తున్నారు. ఇక, తెలంగాణలో పార్టీ పెట్టి పాదయాత్ర చేశారు. కానీ, ఎన్నికల సమయం వచ్చేసరికి తన పార్టీ తరుఫున అభ్యర్థులను పోటీకి దించకుండా కాంగ్రెస్ కు మద్దతిచ్చారు. బీఆర్ఎస్ ఓటమికి తన పార్టీ కీలకమని ఆమె ప్రచారం చేసుకుంటున్నారు. ఇవన్నీ ఊహాగానాలే తప్పా సాంకేతికంగా ఎలాంటి గ్యారెంటీ లేదు. తర్వాత తెలంగాణలో పెట్టిన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి.. ఆమె కాంగ్రెస్ గూటికి చేరారు. ఏపీపీసీసీ చీఫ్ బాధ్యతలు తీసుకొని అధికార వైసీపీ పోరాటం చేస్తున్నారు. షర్మిల బాధ్యతలు తీసుకున్న తర్వాతే ఏపీలో కాంగ్రెస్ కు జవసత్వాలు వచ్చాయి. కానీ.. ఎన్నికల్లో ఆమె గెలిచి చట్ట సభలకు వెళ్తే ఆమెకు పొలిటికల్ గా ఫ్యూచర్ ఉంటుంది. లేదంటే.. కష్టమే. ఎందుకంటే ఆమె భవిష్యత్ కనిపించని పార్టీలో చేరారు. కాంగ్రెస్ ఏపీలో ఎప్పుడు బలపడుతుందో తెలియదు. ఒకవేళ ఆమె ఓడిపోతే.. ఆమె ఫెయిల్యూర్ పొలిటీషియన్ గా ఉండిపోతారు. కాబట్టి ఆమె గెలిచి.. కాంగ్రెస్ కు గౌరవమైన ఓటింగ్ తీసుకొని వస్తే.. అప్పుడు ఆమె సక్సెస్ ఫుల్ లీడర్ అనిపించుకుంటారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -