Poonam Kaur: నన్ను రాజకీయాల్లోకి లాగితే అస్సలు బాగోదు.. పూనమ్ కౌర్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

Poonam Kaur: పూనమ్ కౌర్ పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈమె నటిగా పలు సినిమాలలో నటించినప్పటికీ సినిమాల ద్వారా సంపాదించుకోలేనటువంటి గుర్తింపును సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టుల వల్ల పాపులారిటీ సంపాదించుకున్నారు. ఈమె సోషల్ మీడియా వేదికగా తరచూ ఇతరులను టార్గెట్ చేస్తూ చేసే పోస్టులు పెద్ద ఎత్తున వివాదాలకు కారణం అవుతుంటాయి అయితే ఈమె ఎవరి గురించి ఈ పోస్ట్ చేసింది అని అర్థం చేసుకునే లోపు మరొక్క పోస్ట్ చేస్తూ అందరిని కన్ఫ్యూజన్ కు గురి చేస్తూ ఉంటారు.

ఇలా పూనం ఒక వ్యక్తిని టార్గెట్ చేశారు అంటే వారిని పరోక్షంగా విమర్శిస్తూనే ఉంటారు. ఇకపోతే ఈమె పవన్ కళ్యాణ్ విషయంలో కూడా పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు పవన్ కళ్యాణ్ పూనమ్ మధ్య సంథింగ్ రిలేషన్ ఉంది అంటూ పెద్ద ఎత్తున వీరి గురించి వార్తలు ఒక సమయంలో వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలపై ఈమె స్పందించకపోవడం గమనార్హం. ఇకపోతే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా పూనమ్ స్పందిస్తూ అందరికీ నమస్కారం నేను ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ కండువా కప్పుకోలేదు అలాగే ఏ రాజకీయ పార్టీకి నాకు ఎలాంటి సంబంధం లేదు అయినా కొందరు మాత్రం తమ స్వార్థ రాజకీయాల కోసం నన్ను పావుగా వాడుకున్నారని తెలిపారు. ఇప్పటికైనా మీ రాజకీయాలలోకి నన్ను లాగడం ఆపండి. తన కుటుంబ సభ్యులకు కూడా ఫోన్లు చేస్తున్నారు నేను సిక్కు బిడ్డను దేనినైనా ధైర్యంగా పోరాడగలను.

ప్రస్తుతం తాను చేనేత మహిళల కోసం పోరాటం చేస్తున్నానని ఇప్పటికే వందమంది రాజ్యసభ సభ్యులను కలిశానని మహిళా హక్కుల కోసం తాను పోరాడుతానని తెలియజేశారు. ఇక రాజకీయాలకు సంబంధించిన తాను ఏదైనా చెప్పాలి అనుకుంటే ఆ విషయాలను తానే స్వయంగా చెబుతాను అంటూ ఈ సందర్భంగా తనని రాజకీయాలలోకి లాగొద్దు అంటూ పూనమ్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -