Poonam Kaur-Chandrababu: 73 ఏళ్ల వయస్సులో చంద్రబాబును బాధ పెట్టడం రైట్ కాదు.. పూనమ్ కౌర్ సంచలన కామెంట్స్!

Poonam Kaur-Chandrababu: చంద్రబాబు అరెస్టుతో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిన విషయం తెలిసిందే. అయితే బాబు అరెస్టుపై ఇప్పటికే ఎంతో మంది స్పందించిన విషయం తెలిసిందే. కానీ చంద్రబాబు అరెస్ట్ పై టాలీవుడ్ పెద్దగా స్పందించడం లేదు. ఇప్పటివరకు నిర్మాత అశ్వనీదత్, నట్టి కుమార్ వంటి వారు మాత్రమే స్పందిస్తూ, బాబుకి మడ్దతుగా మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని విమర్శించారు. కానీ పెద్ద వాళ్లు ఎవ్వరు కూడా బాబు ఆరెస్ట్ పై నోరు విప్పడం లేదు. తమకేమీ సంబంధం లేదు అన్నట్టుగా సైలెంట్‌గా ఎవరి పని వారు చేసుకుంటున్నారు.

నందమూరి ఫ్యామిలీ నుంచి అందరూ ఖండించడం లేదు. ఇది ఇలా ఉంటే తాజాగా పూనమ్ కౌర్ ఒక ట్వీట్ చేసింది. చంద్రబాబు అరెస్ట్ పై స్పందించింది. ప్రజల కోసం ఎంతో సేవ చేసి, వారి కోసం అన్నీ త్యాగం చేసిన ఒక గొప్ప వ్యక్తిని 73 ఏళ్ల వయసులో ఇలా బాధపెట్టడం, జైలుకు పంపించడం తగదు. మంచిది కాదు. ఆయన ఆరోగ్యం దృష్ట్యా అయినా మానవతా దృక్పథంతోనైనా ఆలోచించండి అంటూ ట్వీట్ వేసింది. అయితే పూనమ్ వేసిన ట్వీట్ పై నెటిజన్లు మండి పడుతున్నారు. ఎన్టీఆర్‌కి 73 ఏళ్ల వయసులో చంద్రబాబు చేసింది ఏంటి? ఆయన్ను పబ్లిక్‌గా చెప్పులతో కొట్టించాడు కదా?

అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నాడు అంటూ నెటిజన్లు పూనమ్ కౌర్ ట్వీట్‌కు రిప్లై ఇస్తున్నారు. రామారావు గారికి చంద్రబాబు ఏమైనా రెస్పెక్ట్ ఇచ్చాడా? అని నిలదీస్తున్నారు. చట్టం ముందు వయసు చూడరు, తప్పు చేసిన వాళ్లను జైళ్లోనే వేస్తారు అంటూ మరో నెటిజన్ కౌంటర్ ఇచ్చాడు. కొందరు పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ కి మద్దతుగా స్పందిస్తుండగా మరికొందరు నెగిటివ్ గా స్పందిస్తున్నారు..

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -