Posani Krishna Murali: చంద్రబాబు భార్యపై పోసాని సెటైర్లు.. వెన్నుపోటు పొడిచింది ప్రజల కోసమేనా అంటూ?

Posani Krishna Murali:  తాజాగా పోసాని కృష్ణ మురళి చంద్రబాబు భార్య నారా భువనేశ్వరిపై సెటైర్లు వేశారు. భువనేశ్వరి తన భర్త చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడుతూ ప్రజల కోసమే జీవితాన్ని ధార పోశారు అంటూ వ్యాఖ్యలు చేయగా, ఆ వాఖ్యలపై స్పందించిన పోసాని ఆమెపై సంచులను వాఖ్యలు చేశారు. ఇటీవల అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి జైల్లో అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే చంద్రబాబును బయటకు తీసుకురావడానికి టీడీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతలు చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు కూడా చేస్తున్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం సంతోషంతో తగిన శాస్త్రి జరిగింది అన్నట్టుగా నవ్వుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా పోసాని కృష్ణ మురళి ప్రెస్ మీట్ ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నారా భువనేశ్వరి ములాఖాత్ కు వెళ్లొచ్చి ఏం మాట్లాడుతున్నారు. ఆమె భర్త ఎప్పుడు ప్రజల కోసమే ఆలోచిస్తారు అని మాట్లాడారు. మీ తండ్రి ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిoది కూడా ప్రజల కోసమేనా అమ్మా? కెసిఆర్ ను ఇబ్బంది పెట్టడానికి కూడా ఓటుకు నోటు ఇచ్చి అడ్డంగా దొరికిపోయిoది కూడా ప్రజల కోసమా అమ్మా? అంటూ చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి పై పోసాని కృష్ణ మురళి సెటైర్లు పేల్చారు. ఎవరైతే నిజంగా ప్రజలను ప్రేమిస్తాడో వాళ్ళే ఆ ఉన్నతమైన పదవిలో కూర్చుంటాడు అని చెప్పుకొచ్చారు పోసాని.

ABN,ఈనాడు అడ్డదారులు తొక్కితే ప్రజలు బుద్ధి చెబుతారు. రామోజీ రావు ఒక బ్రోకర్ అంటూ మండిపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ సూపర్ స్టార్ అయ్యాక దగ్గరికి తీశారు. కానీ అప్పటివరకు ఈ ఫ్యామిలీ అంతా ఎలా వెలివేశారో అందరికీ తెలుసన్నారు. సీనియర్ ఎన్టీఆర్ కన్నా గొప్ప నటుడు, జూనియర్ NTR అని హరికృష్ణను కూడా చాలా ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు. ఏపీ లో ప్రజలు జగన్ ను నమ్మండి, కులం, మతం, కొంత వరకూ ఉండాలి మితిమీరితే గజ్జి లాగా అవుతుందని అగ్రహించారు పోసాని. ఈ సందర్భంగా పోసాని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఆ వాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -