Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి డూ ఆర్ డై సిచ్యువేషన్.. అక్కడ పార్టీ గెలవడం సులువు కాదా?

Vallabhaneni Vamsi: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికరమైన నియోజవర్గాలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో గన్నవరం నియోజవర్గం మొదటి వరుసలో ఉంటుంది. ఎందుకంటే.. అక్కడ 2019 ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులే మళ్లీ పోటీ చేస్తున్నారు. అభ్యర్థులు వారే కానీ.. పార్టీలో మారాయి. గతసారి వైసీపీ నుంచి పోటీ చేసిన యార్లగడ్డ ఇప్పుడు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. గతసారి టీడీపీ నుంచి పోటీ చేసిన వల్లభనేని వంశీ ఈసారి వైసీపీ తరుఫున పోటీ చేస్తున్నారు.

గన్నవరం నియోజకవర్గ ఓటర్లకు విలక్షణమైన మనస్తత్వం వారిగా పేరుంది. 2014 ఎన్నికల్లో వైసీపీ తరుఫున దుట్టా రామచంద్రరావు పోటీ చేసి ఓడిపోయారు. ఆతర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. 2019 ఎన్నికల్లో ఎన్నారై యార్లగడ్డ వెంకట్రావ్‌ను రంగంలోకి దింపింది వైసీపీ. అయితే టీడీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు వెంకట్రావ్. ఆ తర్వాత.. వల్లభనేని వంశీ.. టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. వంశీరాకను యార్లగడ్డ వ్యతిరేకించినా సరే… పార్టీ మాత్రం వల్లభనేనికే ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చింది అధిష్టానం. ఇద్దరు కలిసి పనిచేసుకోవాలని సూచించింది. కానీ యార్లగడ్డ టీడీపీ గూటికి చేరిపోయారు. జగన్ వల్లభనేని వంశీకి టికెట్ ఇస్తే.. యార్లగడ్డకు చంద్రబాబు టికెట్ ఇచ్చారు.

వల్లభనేని వంశీ టీడీపీని వీడిన తర్వాత ఆ పార్టీలో బలమైన వ్యక్తి లేరు. కనీసం పోటీ చేయడానికి అభ్యర్థి కూడా లేరు. ఇక గన్నవరాన్ని టీడీపీ వదులుకోవాల్సిందేనని అంతా అనుకున్నారు. కానీ.. యార్లగడ్డ ఎంట్రీతో పార్టీలో నూతన ఉత్సాహం వచ్చింది. పైగా గన్నవరంలో కమ్మ ఓటర్లు ఎక్కువ మంది. ఇది కూడా టీడీపీకి ఓ అడ్వాంటేజ్. వంశీ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన నేత అయినప్పటికీ.. చంద్రబాబు సతీమణి గురించి ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో కమ్మ సామాజికవర్గంలో ఆయనపై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. దాన్ని గుర్తించిన వంశీ భువనేశ్వరికి మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పారు. కానీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. టీడీపీ శ్రేణులు వంశీపై తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. టీడీపీతోనే రాజకీయంగా ఎదిగిన వంశీ చంద్రబాబు, భువనేశ్వరిపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడుతున్నారు.

మరోవైపు వైసీపీలో కూడా వంశీపై వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. డాక్టర్ దుట్టా రామచంద్రరావుకు ఈ నియోజకవర్గంలో మంచి పేరు ఉంది. ఆయనతో పాటు డాక్టర్ రాంబాబుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఆయన వంశీని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి వైసీపీ క్యాడర్ మొత్తం వంశీకి సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. అంతేకాదు.. రామచంద్రరావు యార్లగడ్డ వెంకట్రావ్‌కు లోపాయికారి సహకరిస్తారని ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు టీడీపీ అధికారంలో ఉన్నపుడు వల్లభనేని వంశీ వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించాడనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో.. వైసీపీ క్యాడర్ ఆయనకు ఎంత వరకు సహకరిస్తారో చెప్పలేం.

గన్నవరం నియోజవర్గం 1955లో ఏర్పడింది. ఇక్కడి నుంచి పుచ్చలపల్లి సుందరయ్య, కాకాని వెంకటరత్నం లాంటి దిగ్గజాలు గెలిచారు. మొదట కమ్యానిస్టులకు కంచుకోటగా ఉన్న గన్నవరంలో తర్వాత కాంగ్రెస్ బలపడింది. కానీ, టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ కంచుకోటగా మార్చుకుంది. 2009 నుంచి వరుసగా మూడు సార్లు టీడీపీ గెలిచింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -