Posani Krishna Murali: వైరల్ అవుతున్న పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు!

Posani Krishna Murali: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రచయితగా నిర్మాతగా నటుడిగా ఇంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో పోసాని కృష్ణమురళి ఒకరు.ఇండస్ట్రీలో సినీ రచయితగా పనిచేసిన ఈయన అనంతరం నటుడిగా కూడా ఇండస్ట్రీలో పనిచేశారు. ఇక నిర్మాతగా కూడా పలు సినిమాలను నిర్మించారు. ఇలా సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తూనే ప్రస్తుతం రాజకీయాలలో కూడా చాలా చురుగ్గా పాల్గొంటున్నారు.

ప్రస్తుతం పోసాని ఆంధ్ర ప్రదేశ్ ఎఫ్ డీసీ చైర్మన్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇక శుక్రవారం ప్రసాద్ ల్యాబ్ ఫైబర్ నెట్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నటుడు పోసాని కృష్ణమురళి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన నంది అవార్డుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా నంది అవార్డుల గురించి ఈయన మాట్లాడుతూ తాను ఇండస్ట్రీలో బాయ్ గా పని చేస్తున్న సమయం నుంచి నంది అవార్డుల్లోనూ గమనిస్తూనే ఉన్నాను ఒక్కో కాంపౌండ్ కు ఎన్నో నంది అవార్డులు వెళ్లాయి అంటూ ఈయన తెలిపారు.

ఈ నంది అవార్డుల కోసం తాను రెండుసార్లు గొడవకు కూడా దిగానని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇలా నంది అవార్డుల కోసం తాను గొడవకు దిగడంతో పోసాని అనే వ్యక్తికి నంది అవార్డు ఇవ్వకూడదనే నిర్ణయాన్ని కూడా తీసుకున్నారని ఈయన తెలియచేశారు.తాను ఎన్నో సినిమాలకు రచయితగా పనిచేసిన నంది అవార్డు రాలేదు ఇక చివరికి టెంపర్ సినిమాలో తాను నటించినందుకు తనకు నంది అవార్డు వచ్చిందని పోసాని తెలిపారు.

ఇక నాకు నంది అవార్డు రావడంతో నంది అవార్డు తనకు వద్దని ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పానని పోసాని తెలిపారు.నంది అవార్డు కమిటీలో 12 మంది జడ్జిలు ఉంటే అందులో 11 మంది కమ్మ వాళ్లే ఉన్నారని ఈయన గుర్తు చేశారు. ఇలా నంది అవార్డుల కమిటీలో ఎక్కువగా వీళ్లే ఉండటం వల్ల ఆ అవార్డులు కొందరికి కాంపౌండ్లకే ఎక్కువగా వెళ్లేవని అందుకే నంది అవార్డును తాను కమ్మ అవార్డుగా భావించి అప్పట్లో వద్దన్నానని ఈ సందర్భంగా ఈయన నంది అవార్డుల గురించి చేసినటువంటి కామెంట్స్ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -