Prabhas: ఆ గౌరవం ప్రభాస్ కు మాత్రమే సొంతం.. ఇది ప్రభాస్ రేంజ్ అని చెబుతూ?

తెలుగు రాష్ట్రాల ప్రజలకు రెబల్ స్టార్ ప్రభాస్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. చాలా తక్కువ సినిమాలో నటించినప్పటికీ.. చాలా ఎక్కువ సినిమాలకు ఉండే క్రేజ్ ప్రభాస్ సొంతం. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్ గా హడావిడి చేస్తున్నాడు. ఇక రెబల్ స్టార్ అభిమానుల గురించి మనందరికీ తెలిసిందే.

అయితే హాలీవుడ్ లో ఏ హీరోకి దక్కని గౌరవం తాజాగా ప్రభాస్ కి దక్కింది. అవును ఇది నిజమే, దేశ రాజధాని ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరిగే రావణ దహనానికి హాజరు కావాలంటూ ఆయనకు ఆహ్వానం అందింది. కాగా ప్రభాస్ కు రామ్ లీలా కమిటీ నుంచి ఆహ్వానం అందినట్లు తెలుస్తుంది. ఏ హీరోకు ఈ విధంగా దక్కని గౌరవంగా ఏకంగా రాష్ట్రపతి, ఢిల్లీ ముఖ్యమంత్రితో కలిసి ప్రభాస్ ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నాడు.

ద్రౌపతి ముర్ముతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ తో కలిసి ప్రభాస్ ఈ వేడుకలో హాజరు కాబోతున్నాడు. ప్రతి సంవత్సరం రామ్ లీలా మైదానంలో రావణ దహనం ఎంతో హడావిడిగా సాగుతుంది. కాగా ఈ సంవత్సరం రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఈ వేడుకలో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం ఈ విషయం తెలిసిన ప్రభాస్ అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ కి సంబంధించిన ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఏదేమైనా రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయినప్పటి నుంచి అతని హడావిడి మరో స్థాయిలో ఉంది. ఈ క్రమంలో అతడు వరుస సినిమా అవకాశాలు కూడా అందుకుంటున్నాడు. త్వరలో డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఆది పురుష్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో కానీ.. టీజర్ విడుదలయ్యాక అనేక రకాల విమర్శలు ఈ సినిమా విషయంలో ఎదురవుతున్నాయి.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

Pawan Kalyan: పవన్ కు ఎక్కువ సీట్లు ఇచ్చే ఆలోచన లేదా.. ఏం జరిగిందంటే?

Pawan Kalyan: ఏపీలో తాజాగా జరిగిన పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఏపీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం పార్టీ హవానే...
- Advertisement -