Prabhas-Bunny: ప్రభాస్-బన్నీ ఫ్యాన్స్ మధ్య చర్చ.. ఏమైందంటే?

Prabhas-Bunny: స్టార్ హీరోల మధ్య పోటీతత్వం సహజంగానే ఉంటుంది. సీనియర్ హీరోల నుంచి మొదులుకుని ఇప్పుడున్న యంగ్ హీరోల వరకు ఆ పోటీని కొనసాగిస్తూనే ఉన్నారు. సినిమాల్లో పోటీ చూపించినా.. వ్యక్తిగతం వీరందరూ మంచి స్నేహితులు. ఇలాంటి పోటీతత్వం అన్ని ఇండస్ట్రీలో ఉంటనే ఉంటుంది. ఈ మధ్యకాలంలో చాలావరకు సినిమాలు పాన్ ఇండియా స్థాయికి రీచ్ అవుతున్నాయి. డైరెక్టర్‌ కూడా కేవలం ఒకే ఇండస్ట్రీకి పరిమితమయ్యే సినిమాలు చేయకుండా.. పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో సినిమా క్లిక్ అయితేనే అటు సినిమాకు, హీరోలకు మార్కెట్ ఉంటోంది.

 

 

లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం టాలీవుడ్ ఇద్దరు స్టార్ హీరోల మధ్య పోటీ వాతావరణం నెలకొన్నట్లు కనిపిస్తోంది. బహుబలి సినిమాలో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన ప్రభాస్‌కు, పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన అల్లుఅర్జున్‌కు మధ్య వార్ నడుస్తోంది. వారసత్వంగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన వీరిద్దరూ.. తమ టాలెంట్‌తో స్టార్ హీరోలుగా ఎదుగుతున్నారు. ప్రభాస్ బహుబలి సినిమాతో గ్లోబల్ స్టార్‌గా ఈమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. బన్నీ మాత్రం పుష్ప-2తో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నాడు. అయితే దర్శకధీరుడు రాజమౌళి వల్ల వీరిద్దరి అభిమానుల మధ్య వార్ నడుస్తోంది. ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా తర్వాత మళ్లీ ప్రభాస్‌తో కలిసి బహుబలి-3 సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

 

 

అయితే ఈ విషయంపై బన్నీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ప్రభాస్ రాజమౌళితో సినిమా చేశారు. మళ్లీ ప్రభాస్‌తో సినిమా ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. డైరెక్టర్ రాజమౌళి ఇప్పటివరకు అల్లుఅర్జున్‌తో కలిసి ఒక్క సినిమా చేయలేదు. కాబట్టి తన తర్వాతి సినిమా బన్నితోనే చేయాలని మొండిపట్టుకుని కూర్చున్నారు. ఈ విషయాన్ని అడ్డుపెట్టుకుని ప్రభాస్‌ను టార్గెట్ చేస్తున్నారు. బహుబలి వంటి హిట్ సినిమాను తీశారని, ఇప్పటికే ప్రభాస్ మానియా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. అలా అని అల్లుఅర్జున్ తక్కువేం కాదని, ఇప్పటి వరకు ఎన్నో హిట్ సినిమాలు చేశాడని అభిమానులు చెబుతున్నారు. రాజమౌళి.. అల్లుఅర్జున్‌తో కలిసి కచ్చితంగా సినిమా చేయాలని కోరుతున్నారు. మరోవైపు ప్రభాస్ ప్యాన్స్ కూడా.. అల్లుఅర్జున్‌తో మా డార్లింగ్ పోటీ ఏంటని నవ్వుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు పోటీ అదే పేర్లతో ఉన్న ఇద్దరు పోటీ.. వైసీపీ కుట్ర చేస్తోందా?

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల త్వరలోనే జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల హడావిడి నెలకొంది. ఈ క్రమంలోనే ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది. అయితే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఒక్కో...
- Advertisement -
- Advertisement -