Prabhas: రాజమౌళి లేకపోతే ప్రభాస్ తెలుగుకే పరిమితం.. రుణపడి ఉండాలంటూ?

Prabhas: టాలీవుడ్ ప్రేక్షకులకు రెబల్ స్టార్ ప్రభాస్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్ తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా వెలుగుతున్నాడు. ఈ క్రమంలో వరల్డ్ వైడ్ గా సినిమా అవకాశాలు అందుకుంటున్నాడు ప్రభాస్. ఇక తమిళంలో మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియన్ సెల్వన్ మూవీ రెండు రోజుల క్రితం విడుదలైంది.

ఈ సినిమా విడుదలకు ముందు తమిళ ప్రేక్షకులు ఈ సినిమాను భారీ స్థాయిలో హైలెట్ చేశారు. ఎంతలా అంటే బాహుబలా బొక్కా.. బాహుబలి సినిమాను కూడా ఈ సినిమా బ్రేక్ చేస్తుందన్నట్లుగా మాట్లాడారు. కాగా ఈ మాటలను ప్రభాస్ అభిమానులు తీసుకోలేకపోయారు. వెంటనే తిరిగి కౌంటర్ ఇచ్చారు. బాహుబలి సినిమాకు మీ సినిమాకు ఏమన్నా పోలిక ఉందా అని అనేక రకాలుగా తమిళ ప్రేక్షకులను దెప్పి పొడిచారు.

కాగా తాజాగా ప్రభాస్ అభిమానులు తమిళ ప్రేక్షకులకు ఒక రేంజ్ లో దొరికిపోయారు. కొన్ని గంటలకు క్రితం ప్రభాస్ ఆది పురుష్ సినిమా టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ చూసిన తమిళ ప్రేక్షకులు ఇది ఒక కార్టూన్ సినిమా అని, ఈ సినిమాను చుట్టి టీవీ లో కార్టూన్ గా వేసుకోవాలని అనేక రకాలుగా ప్రభాస్ అభిమానులను దెప్పి పొడుస్తున్నారు. ఈ సినిమా తర్వాత నిర్మాతలు నెత్తి మీద గుడ్డ వేసుకోవాలి, ఆస్తులు అమ్ముకోవాలి అని కామెంట్లు పెడుతున్నారు.

మరి కొంతమంది తమిళ ప్రేక్షకులు ప్రభాస్ వరుస ప్లాపులతో బాంబులు పేలుస్తున్నాడని, ఇదేవిధంగా ఆది పురుష్ సినిమా కూడా ఫెయిల్ అయ్యి మరో బాంబుగా పేలుతుందని అంటున్నారు. ఇక మరి కొంతమంది రాజమౌళి లేకపోతే ప్రభాస్ తెలుగు ఇండస్ట్రీకే పరిమితమయ్యేవాడు, నిజంగా ప్రభాస్ అభిమానులు రాజమౌళి కి రుణపడి ఉండాలన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఏదేమైనా ప్రభాస్ అభిమానులను మాత్రం కోలీవుడ్ ప్రేక్షకులు మరో స్థాయిలో ఏకీపారేస్తున్నారు.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

LIC policy: ఈ ఎల్ఐసీ పాలసీ గురించి తెలుసా.. రూ.కోటి పొందే అవకాశం!

LIC policy: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేర్వేరు వర్గాల కస్టమర్ల కోసం పలు రకాల పాలసీలను అందిస్తోంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వేర్వేరు ఎల్ఐసీ పాలసీలను ప్రకటిస్తూ...
- Advertisement -