Prabhas: ఈ సారి ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఉండవా?

Prabhas: తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. తన క్రేజ్‌తో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్‌ ఫాలొయింగ్ సంపాదించుకున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బహుబలి సినిమాలో ప్రభాస్ నట విశ్వరూపం చూపించాడు. ప్రస్తుతం ప్రభాస్.. సలార్, ప్రాజెక్ట్-కే, స్పిరిట్, ఆదిపురుష్ సినిమాలో నటిస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో మరో సినిమా రాబోతుంది. ఈ సినిమాలో దెయ్యం క్యారెక్టర్‌లో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ సినిమాలో హీరోయిన్ జ్యోతిక నటించినట్లుగా.. ప్రభాస్ కూడా దెయ్యం ఆవహించినప్పుడు విచిత్రంగా ప్రవర్తిస్తాడని సమాచారం.

అయితే అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టిన రోజు. దీంతో ప్రపంచంలోని అతని అభిమానులందరూ ప్రభాస్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకోవాలని సన్నాహాలు చేపడుతున్నారు. అలాగే ప్రభాస్ చిత్ర నిర్మాతలు కూడా ప్రభాస్ అభిమానులని అలరించడానికి ప్లాన్ చేస్తున్నారు. సలార్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్, ఆదిపురుష్ సినిమా అప్‌డేట్‌కు సంబంధించిన విషయాలను వెల్లడించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కానీ ప్రభాస్ తన జన్మదిన వేడుకలపై సంచలన నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం.

ఇటీవల ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు స్వర్గీయులైన విషయం తెలిసిందే. ప్రభాస్‌కు తన పెద్దనాన్న అంటే ఎంతో ఇష్టం. ఈ బాధకార సమయంలో తన జన్మదిన వేడుకలను జరుపుకోవడం సరికాదని ప్రభాస్ భావిస్తున్నారు. అందుకే ఈ ఏడాది జన్మదిన వేడుకలను పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉంది. ప్రభాస్ కూడా తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోకూడని అనుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం ప్రభాస్ ఫ్యాన్స్ కు బాధ కలిగించినా.. ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకుని సైలెంట్ అవుతున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ అభిమానులు కూడా సింపుల్‌గా సెలబ్రేషన్స్ చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Sai Dharam Tej-Swathi: సాయితేజ్, స్వాతిరెడ్డి మధ్య అలాంటి బంధం ఉందా.. విడాకుల వెనుక ట్విస్టులు ఉన్నాయా?

Sai Dharam Tej-Swathi:స్వాతి రెడ్డి, సాయి ధరమ్ తేజ్ ని స్టేజిపై ఒరేయ్ అని పిలవడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిన సంఘటన మంత్ ఆఫ్ మధు ట్రైలర్ ఈవెంట్లో జరిగింది....
- Advertisement -
- Advertisement -