Pragati Bhavan: ప్రగతిభవన్‌కు ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో తెలుసా?

Pragati Bhavan: తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతిభవన్ అనే విషయం అందరికీ తెలిసిందే. సీఎం కేసీఆర్ తన ఫ్యామిలీతో కలిసి ప్రగతిభవన్ లోనే నివాసం ఉంటున్నారు. ఇక ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు అప్పుడప్పుడు వెళుతూ ఉంటారు. కేసీఆర్ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఫీసర్స్ కాలనీలోని 10 మంది ఐఏఎస్ అధికారులు, 24 మంది ప్యూన్ల క్వార్టర్లను కూల్చివేశారు. ఆ స్థలంలో ప్రగతిభవన్ నిర్మించారు. అయితే ప్రగతిభవన్ నిర్మాణంతో పాటు మెయింటనెన్స్, నెలవారీ ఖర్చులు రూ.కోట్లలోన అవుతున్నాయి. ప్రజాధనం కోట్లకు కోట్లు ఖర్చు అవుతుంది. ఇంద్రభవనంలా ఉండే ప్రగతిభవన్ కు భారీ మొత్తంలోనే ఖర్చు అవుతుంది.

తాజాగా ఆర్టీఐ ద్వారా ప్రగతిభవన్ ఖర్చు వివరాలు బయటపడ్డాయి. ఆశ్చర్యకరపోయేలా ఈ వివరాలు ఉన్నాయి. ఆర్టీఐ కార్యకర్త రాబిన్ జాక్వెస్ ఆర్టీఐ ద్వారా ప్రగతిభవన్ కు అవుతున్న ఖర్చు వివరాలను తెలపాలని రోడ్లు, భవనాల శాఖకు దరఖాస్తు పెట్టుకున్నారు. దీంతో ప్రగతిభవన్ కు అవుతున్న ఖర్చు వివరాలను రోడ్లు, భవనాల శాఖ బయటపెట్టింది. ప్రగతిభవన్ నిర్మించిన దగ్గర నుంచి ఇప్పటివరకు వివిధ పనులకు రూ.50.90 కోట్లు ఖర్చు అయిందని బయటపడింది. 2016లో రూ.45.91 కోట్లతో ప్రగతిభవన్ నిర్మించారు. కానీ ప్రగతిభవన్ లోని వివిధ పనులకు రూ.50.90 కోట్ల ఖర్చు అయింది. ప్రగతిభవన్ ఆవరణలోని ఐదు భవనాలకు పెయింటింగ్ పనులకు రూ.75 లక్షలు, సీఎం నివాసంలో అధునాతన మాడ్యులర్ కిచెక్ కోసం రూ.26 లక్షలు, క్యాంపు కార్యాలయంలో శాశ్వత వేదిక కోసం రూ.89108 ఖర్చు పెట్టారు.

ఇక సెక్యూరిటీ గార్డుల కోసం షెడ్డు నిర్మాణం కోసం రూ.7.85 లక్షలు, ప్లంబర్లు, కార్పెంటర్లు, ఇతర సిబ్బందికి చెల్లింపుల కోసం రూ.14.45 లక్షలు ఖర్చు చేశారు. ఇక 2017-18లో భవనంలోని అత్యవసర నిర్వహణ పనులకు రూ.44277 ఖర్చు చేశారు. 2018-19లో అత్యవసర నిర్వహణ పనుల పనులకు రూ.99000, ప్లంబర్లు, కార్పొంటర్లు, ఇతర సిబ్బందికి చెల్లింపుల కోసం రూ.22.06 లక్షలు, సీఎం సభ వేదిక పొడిగింపు కోసం రూ.40467 ఖర్చు అయింది. ఇక 20-21లో ప్లంబర్లు, కార్పెంటర్లకు ఇతర అవసరాల కోసం రూ.35.03 లక్షలు,, సెక్యూరిటీ గార్డుల కోసం డ్రెస్సింగ్ రూమ్ కోసం రూ.9.38 లక్షలు ఖర్చు పెట్టారు.

ఇక థర్మాకోల్ సీలింగ్ పనుల కోసం రూ.5.14 లక్షలు, ప్రగతిభవన్ తర్పువైపున పెట్రోలింగ్ కారిడార్ కోసం రూ.26 లక్షలు ఖర్చు చేశారు. ప్రధాన గేటు బారికేడింగ్ పొడిగింపు కోసం రూ.7.15 లక్షలు, ప్రధాన భవనంలోని మొదటి అంతస్తులో మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.3.14 లక్షలకుపైగా ఖర్చు చేసినట్లు తేలింది. ప్రగతిభవన్ కు అయిన ఖర్చు వివరాలు తెలిసి ప్రజలు నోరువెళ్లబెడుతున్నారు. వామ్మో.. ఈన్ని కోట్లు ఖర్చు అయిందా అంటూ అవాక్కమవుతున్నారు. ప్రజాధనమే కదా అని కేసీఆర్ తన సౌకర్యాల కోసం కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -