Priyanka Gandhi: రంగంలోకి ప్రియాంకగాంధీ.. మునుగోడులో కాంగ్రెస్ కు బూస్ట్

Priyanka Gandhi: మునుగోడు ఉపఎన్నికపై కాంగ్రెస్ భారీ ఆశలు పెట్టుకుంది. ఈ ఉపఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సిట్టింగ్ స్థానం కావడం, ఏడాదిలో సాధారణ అసెంబ్లీ ఎన్నికలు రానుండటంతో మునుగోడు ఉపఎన్నికను పెద్ద సవాల్ గా తీసుకుంది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ సిట్టింగ్ స్థానానికి జరుగుతున్న ఎన్నిక కావడంతో ఆయనకు ఇది ఛాలెంజ్ గా మారింది. తెలంగాణ కాంగ్రెస్ సారధిగా ఉన్న రేవంత్ రెడ్డి.. మునుగోడులో కాంగ్రెస్ ను గెలిపించకపోతే ఆయన పీసీసీ పదవికి గండం పొంచి ఉండే ప్రమాదం కూడా లేకపోలేదు. ఇప్పటికే పార్టీలో కొత్తగా చేరిన ఆయనకు పీసీసీ పదవి ఇవ్వడంపై పార్టీలో ఎప్పటినుంచో ఉన్న సీనియర్లు గుర్రుగా ఉన్నారు.

రేవంత్ రెడ్డికి పార్టీలోని సీనియర్లు ఎవరూ సహకరించడం లేదు. అందరూ ఆయనకు వ్యతిరేకంగానే పనిచేస్తున్నారు. రేవంత్ తమను కలుపుకుని పోవడం లేదని హైకమాండ్ కు ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. కోమటిడ్డి వెంకటరెడ్డి, వీహెచ్, మధుయాష్కీ తో పాటు చాలామంది సీనియర్ నేతలు రేవంత్ పై అధిష్టానానికి పలుమార్లు ఫిర్యాదు చేశారు. భట్టి, ఉత్తమ్ పైకి రేవంత్ కు అనుకూలమని చెబుతున్నప్పటికీ.. తెరవెనుక వారు కూడా యాంటీగానే ఉన్నారు.

ఈ క్రమంలో మునుగోడులో కాంగ్రెస్ ను గెలిపించుకోవడం రేవంత్ కు కష్టంగానే మారింది. ఈ ఎన్నికపై ఫోకస్ పెట్టిన హైకమాండ్.. ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేతలతో సమావేశమైంది. సోనియాగాంధీ నివాసంలో జరిగిన ఈ భేటీలో రేవంత్, ఉత్తమ్, శ్రీధర్ రెడ్డి, మధుయాష్కీ హాజరయ్యారు. సీనియర్ల అందరూ విబేధాలు వదిలేసి ఏకతాటిపైకి రావాలని ప్రియాంకగాంధీ సూచించారు. దాదాపు రెండున్నర గంటల పాటు ఈ సమావేశం జరగ్గా.. మునుగోడు ఉపఎన్నిక, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం, రేవంత్ తీరు చర్చకు వచ్చింది. హైకమాండ్ ముందే నేతలు వాగ్విదానికి దిగారు. రేవంత్ సీనియర్లను కలుపుకుని పోవడం లేదని, తమ సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారని అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. పార్టీలో విబేధాలను పక్కన పెట్టాలని, పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టాలని ప్రియాంక గాంధీ సూచించారు.

అయితే మునుగోడులో ప్రియాంక గాంధీ రంగంలోకి దిగనున్నారు. వచ్చే నెలలో ప్రచారానికి రానున్నారు. మునుగోడులో ప్రియాంక గాంధీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ భారీ బహిరంగ సభతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ వస్తుందని ఆ పార్టీ భావిస్తుంది.

ఇక నుంచి తెలంగాణ రాజకీయాలపై ప్రియాంక గాంధీ పూర్తిస్ధాయిలో ఫోకస్ పెట్టనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ను నిశితంగా పరిశీలించనున్నారు. మునుగోడు అభ్యర్థిపై కూడా నిన్నటి సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోనియాగాంధీకి లేఖ రాశారు. సమావేశానికి ఎందుకు రాలేదే అందులో వివరించారు.

పీసీసీని ప్రక్షాళన చేయాలని, మాణిక్యం ఠాగూర్ ను మార్చాలని కోరారు. తాను ఎట్టిపరిస్థితుల్లోనూ కాంగ్రెస్ ను వీడేది లేదని అందులో స్పష్టం చేశారు. మాణిక్యం ఠాగూర్ ని తొలగించిన కమల్ నాధ్ వంటి సీనియర్ నేతకు ఇంచార్జ్ గా బాధ్యతలు అప్పగించాలని సూచించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -