Puri Jagannath: పైసా కూడా ఇవ్వను.. ఏం చేసుకుంటారో చేస్కోండి: పూరి జగన్నాథ్

Puri Jagannath: ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ రూటే సపరేట్. ఎందుకంటే అతడిలా ఉండే డైరెక్టర్ ఎక్కడా దొరకడు. సినీ ఇండస్ట్రీలో ఎన్నో ఆస్తులు సంపాదించి.. ఒకే సారి రోడ్డుపై వచ్చారు. ఉన్న ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా మళ్లీ తన పూర్వ వైభవాన్ని తిరిగి సంపాదించుకున్నాడు. అంతటి సత్తా ఉన్న దర్శకుడు పూరి జగన్నాథ్ మాత్రమే. డబ్బులు ఎలా కోల్పోయినా తిరిగి సంపాదించుకునే కెపాసిటీ.. ట్యాలెంట్ పూరికి మాత్రమే సొంతం. అలాంటి డైరెక్టర్ ఇటీవల స్టార్ హీరో విజయ్ దేవరకొండతో కలిసి ‘లైగర్’ సినిమా తీశాడు. ఇందులో హీరోయిన్‌గా అనన్య పాండే నటించారు. ప్రమోషన్ల సమయంలో ఈ సినిమా భారీ హైప్‌ను అందుకుంది. పాన్ ఇండియా లెవల్‌లో ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తుందని భావించారు. కానీ పూరి జగన్నాథ్‌కు గట్టి దెబ్బే తగిలింది.

ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు వెనక్కి ఇవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో పూరి జగన్నాథ్ కూడా డబ్బులు తిరిగి ఇస్తానని చెప్పారు. కానీ కొన్ని కారణాల వల్ల డబ్బులు ఇవ్వలేకపోయారు. దీంతో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ధర్నాకు దిగుతున్నట్లు వార్తలు వినిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పూరికి సంబంధించిన ఓ ఆడియో క్లిప్ లీకైంది. ఈ ఆడియో ఫోన్ సంభాషణ అని అనిపించేలా స్టార్ట్ అయినా.. జస్ట్ వాయిస్ రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఆడియోలో పూరి అందరికీ ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

ఆడియోలో పూరి మాట్లాడుతూ.. ‘రూల్స్ ప్రకారం చూస్తే.. నేను ఎవరికీ పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ నష్టపోయారు కనుక డబ్బులు వాపసు ఇవ్వాలని అనుకున్నాను. అందుకు నెల రోజులపాటు టైం కూడా అడిగాను. ఒక్కసారి మాట ఇస్తే తప్పకుండా డబ్బులు వాపసు చేస్తా. సినిమా తీసిన తర్వాత విడుదలకు నానా ఇబ్బందులు పడ్డాం. తనకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్లు ఎవ్వరూ తిరిగి ఇవ్వలేదు. పోకిరి సినిమా దగ్గర్నుంచి ఇప్పటివరకు చాలా మంది నుంచి డబ్బులు రావాల్సి ఉంది. తన పరువు పోతుందని డబ్బులు వాపసు ఇస్తా అని చెబుతున్నా.. అయినా ధర్నా చేసి పరువు తీస్తా అంటే రూపాయి కూడా వెనక్కి ఇవ్వను. ఏం చేసుకుంటారో చేస్తోండి.’ అని క్లారిటీ ఇచ్చారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -