Rahul Sipligunj: ఆరేళ్ల తర్వాత రతిక ఫోటోలు ఎలా బయటికొచ్చాయి.. రాహుల్ సిప్లిగంజ్ సంచలన వ్యాఖ్యలు!

Rahul Sipligunj: బిగ్ బాస్ హౌస్ లో కాస్త అతి చేస్తూ ఓవరాక్షన్ చేస్తూ, తన ప్రవర్తనతో అందరికీ చిరాకు తెప్పిస్తోంది రతిక. ఏ క్షణంలో ఎలా ఉంటుందో ఎవరితో ఎలా మాట్లాడుతుందో ప్రేక్షకుల అంచనాలకు కూడా అందకుండా ప్రవర్తిస్తోంది. బిగ్‌బాస్‌ ఇచ్చిన గేమ్‌ ఆడకుండా హౌస్‌మేట్స్‌తో ఆడింది. వారి సహనానికి పరీక్ష పెడుతూ మొండిగా ప్రవర్తిస్తూ ముప్పతిప్పలు పెట్టింది. ఇప్పుడేమో హౌస్‌లో లవ్‌ ట్రాక్‌లు నడుపుతూ, వెనకాల వెన్నుపోటు పొడుస్తూ డబుల్‌ గేమ్‌ మొదలుపెట్టింది. ఇదంతా పక్కనపెడితే రతిక హౌస్ లో తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌ గుర్తొస్తున్నాడంటూ కన్నీళ్లు పెట్టుకుంది. పదే పదే అతడి గురించే ప్రస్తావిస్తోంది.

అతడు గుర్తొస్తే తన మైండ్‌ పని చేయడమే ఆగిపోతోందని చెప్పుకొచ్చింది. అతడు సింగర్‌ అని కూడా హింటిచ్చింది. చివరకు ఆ సింగర్‌ మరెవరో కాదు, రాహుల్‌ సిప్లిగంజ్‌ అంటూ నెట్టింట ఫోటోలు కూడా లీకయ్యాయి. తాజాగా దీనిపై రాహుల్‌ స్పందించిన సంగతి తెలిసిందే! ఈ ఫేక్‌ సింపతీ గేమ్స్‌ ఎప్పటివరకు? కొందరు పక్కనోళ్ల పేరు, ఫేమ్‌ ఉపయోగించుకోవాలని చూస్తుంటారు. వారి గుర్తింపు కోసం నా పేరును అవసరానికి మించి వాడుకుంటున్నారు అంటూ పేరు చెప్పకుండా మండిపడ్డాడు. అయితే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఫోటోలు లీక్‌ అవడంపై అనుమానం వ్యక్తం చేశాడు. నాకో డౌట్‌.. ఆరేళ్ల తర్వాత సడన్‌గా వారి పర్సనల్‌ ఫోన్‌లో ఉన్న ఫోటోలు ఇంటర్నెట్‌లోకి ఎలా వచ్చాయి?

అంటే లోపలికి వెళ్లడానికి ముందే ఇదంతా ప్లాన్‌ చేసుకున్నారా? సమాధానమేంటో మీకే అర్థమవుతుందనుకుంటా! అక్కడున్నది అబ్బాయైనా, అమ్మాయైనా వారి జీవితాలతో నాకెటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు సక్సెస్‌ అయ్యేందుకు ఎంతగానో కష్టపడుతున్నారు. ప్రతి ఒక్కరికి గత ఉంటుంది. ఇలా ఫోటోలు లీక్‌ చసి ఇబ్బంది పెట్టేముందు క్షణం ఆలోచించాల్సింది. ఎదుటివ్యక్తి కుటుంబం, స్నేహితులు దీని వల్ల ఎంత ఎఫెక్ట్‌ అవుతారని ఆలోచించి ఉంటే బాగుండేది. ప్రతి ఒక్కరికి గతం, వర్తమానం అనేవి రెండూ ఉంటాయి. అసలేం జరిగిందో తెలియకుండా ఎవరిది తప్పు? ఒప్పు? అని డిసైడ్‌ చేయకండి. ఇది అర్థం చేసుకున్నవారికి థాంక్యూ.. లేదు, విషాన్ని చిమ్ముతామనుకునేవారికి ఆల్‌ ద బెస్ట్‌ అంటూ రాసుకొచ్చాడు రాహుల్ సిప్లిగంజ్.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -