Ram Charan: రామ్ చరణ్ కొనుగోలు చేసిన కొత్తగుర్రం ఖరీరెంతో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

Ram Charan: మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇప్పుడు మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రామ్ ప్రస్తుతం కెరియర్ పరంగా పీక్ లో ఉన్నాడు. వరుసగా సినిమాలు కమిట్ అవుతూ ఎంతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ దిల్ రాజు నిర్మాణంలో శంకర్ దర్శకత్వం వహిస్తున్న గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ పనులతో బిజీగా ఉన్నాడు.

పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు కూడా చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే పర్సనల్ లైఫ్ లో ఈ మధ్యనే ఒక ఆడబిడ్డ కి తండ్రిగా మారిన చరణ్ జీవితంలో కూడా హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. తన ఫ్యామిలీ తో పాటు తనకి ఇష్టమైన మరొక విషయం హార్స్ రైడింగ్. అతని దగ్గర ఇప్పటికే చాలా గుర్రాలు ఉన్నాయి.

చిన్నప్పటినుంచి కూడా రామ్ చరణ్ కి గుర్రాలని పెంచుకోవడం అన్నా, హార్స్ రైడింగ్ అన్నా చాలా ఇష్టం. అలా హార్స్ రైడింగ్ నేర్చుకోవడం మగధీర సినిమాకి ఎంతో ఉపయోగపడింది. మగధీర సినిమాలో ఈయన సొంత గుర్రమే ఒక సీన్ లో కనిపిస్తుంది. ఆ గుర్రం పేరు కాజల్ అని దాని ప్రత్యేకతల గురించి అప్పట్లో రామ్ చరణ్ చాలాసార్లు చెప్పుకొచ్చాడు. అయితే తాజాగా అతని హార్స్ ఫ్యామిలీలోకి మరొక కొత్త హార్స్ ని తీసుకువచ్చాడు రామ్ చరణ్. దాని పేరు బ్లేజ్.

తన కొత్త గుర్రంతో కలిసి రాంచరణ్ దిగినటువంటి ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. బ్లేజ్ మై న్యూ ఫ్రెండ్ అంటూ గుర్రంతో కలిసి దిగిన ఫోటోని ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు రామ్ చరణ్. అయితే ఈ గుర్రం ఖరీదు ఇంచుమించు మూడు నాలుగు కోట్లు ఉంటుందని, ఆ గుర్రం ఖరీదు తో ఒక పెద్ద విల్లా గాని బంగ్లా కాని కొనుక్కోవచ్చు అంటున్నారు సామాన్య ప్రేక్షకులు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -