Ram Charan-NTR: రామ్ చరణ్‌ను మించిపోయిన తారక్.. ఎందులో అంటే?

Ram Charan-NTR: జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి డైరెక్షన్‌లో రూపొందిన ఆర్ఆర్ఆర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా అనేక రికార్డులను సృష్టిస్తోంది. ఇప్పుడు జపాన్‌లోనూ చరిత్రలో ఎప్పుడూ లేనంత కలెక్షన్లను సాధిస్తోంది. అనేక అవార్డులను సొంతం చేసుకుంది. ప్రఖ్యాత ఆస్కార్‌కు నామినేట్ అయ్యే అవకాశాన్ని తృటిలో చేజారినప్పటికీ అభిమానుల మనసు గెలుచుకుంది. విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించారు. ఇందులోని సన్నివేశాలు, పాటలు మనసును హత్తుకున్నాయి.

వారి డ్యాన్స్ నభూతో నభవిష్యత్

ముఖ్యంగా సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల నటన హైలెట్. అలాగే నాటు నాటు పాటకు వారు చేసిన డ్యాన్స్ నభూతో నభవిష్యత్. ఇందులో వారిద్దరూ పోటీపడి డ్యాన్స్ చేశారు. కొన్ని లక్షల మంది ఈ డ్యాన్స్‌ను ట్రై చేసి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూనే ఉన్నారు.

ఈ క్రమంలో వారిద్దరిలో ఎవరు గొప్పగా నటించారు? డ్యాన్స్ చేశారు? అనే అంశంపై సోషల్ మీడియాలో చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ విషయమై రాజమౌళి మాట్లాడుతూ, ‘ఎన్టీఆర్ చాలా మంచి డాన్సర్. చాలా స్పీడ్‌గా చేస్తాడు. దీంతో రామ్ చరణ్ డాన్సులతో మ్యాచ్ చేయడం కోసం ఎన్టీఆర్ ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది. అంటే, ఇద్దరూ ఒకేలా డాన్స్ చేస్తున్నట్లు కనిపించడానికి అలా చేయక తప్పలేదు’ అని చెప్పారు.

పాట చిత్రీకరణ సమయంలో ఎంత బాగా వస్తున్నా గానీ, ఇంకోసారి.. అంటూ పదే పదే రాజమౌళి అడుగు తూనే వుండేవాడనీ, జక్కన్న అలా వేధిస్తోంటే ఒక్కోసారి విసుగు వచ్చేదని ఎన్టీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. దాదాపు 10 సార్లు చేసిన తర్వాత.. మొదటి షాట్‌ను ఓకే చేశారని చెప్పారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -