Ram Charan: ఇన్ని సినిమాలను రిజెక్ట్ చేసి పలు బ్లాక్ బస్టర్స్ మిస్ చేసుకున్న చరణ్!

Ram Charan: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోలకు కొన్ని సినిమా కథలు వెతుక్కుంటూ వస్తాయి. అయితేకొన్ని కారణాల వల్ల హీరో హీరోయిన్లు కొన్నిసార్లు తమకు వచ్చిన అవకాశాలను వదులుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.ఇలా తమ కెరియర్ లో మిస్ చేసుకున్న సినిమాలు కొన్ని బ్లాక్ బస్టర్ కాగా మరికొన్ని డిజాస్టర్ అవుతాయి. ఇలా మిస్ చేసుకున్న సినిమాలు హిట్ అయితే ఎందుకు వదులుకున్నామా అని బాధపడిన వారు ఉన్నారు. డిజాస్టర్ అయితే చేయకపోవడమే మంచిదైందని భావించే వాళ్ళు కూడా ఉన్నారు.

ఈ క్రమంలోనే మెగా వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటుడు రామ్ చరణ్ తేజ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిరుత సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.ఈ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రామ్ చరణ్ అనంతరం మగధీర వంటి బ్లాక్ బాస్టర్ చిత్రంలో నటించారు.ఇలా వరుస సినిమాలతో ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాంచరణ్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించుకున్నారు.

ఇకపోతే రామ్ చరణ్ సినీ కెరియర్ లో కూడా కొన్ని సినిమాలను రిజెక్ట్ చేశారు.ఇందులో కొన్ని డిజాస్టర్ కాగా మరికొన్ని బ్లాక్ బస్టర్ అయ్యాయి. మరి రామ్ చరణ్ రిజెక్ట్ చేశాడా ఆ సినిమాలు ఏంటి అనే విషయానికి వస్తే… రామ్ చరణ్ ప్రభాస్ హీరోగా నటించిన డార్లింగ్ సినిమా చేసే అవకాశం ముందుగా ఈయనకే వచ్చింది అయితే కథ మొత్తం విన్న రామ్ చరణ్ ఈ సినిమా ప్రభాస్ కైతే సెట్ అవుతుందని సలహా ఇచ్చారట. ఇలా ఈ సినిమాని చరణ్ రిజెక్ట్ చేయడంతో ప్రభాస్ హిట్ కొట్టారు.

ఈ సినిమానే కాకుండా ఈయన కృష్ణం వందే జగద్గురుం, సూర్య సన్నాఫ్ కృష్ణన్, ఎటో వెళ్లిపోయింది మనసు, కృష్ణార్జున యుద్ధం, నేల టికెట్, ఓకే బంగారం, శ్రీమంతుడు, మనం వంటి సినిమాలను రామ్ చరణ్ కొన్ని కారణాలవల్ల రిజెక్ట్ చేశారు. ఇందులో డిజాస్టర్ సినిమాలు ఉన్నాయి. అలాగే బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా ఉన్నాయని చెప్పాలి. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -