Ram Charan-Allu Arjun: బన్నీ చరణ్ మధ్య గొడవలు ఉన్నాయా.. ఆ ఫంక్షన్ కు చరణ్ రాకపోవడానికి కారణమిదేనా?

Ram Charan-Allu Arjun:  ఒకప్పుడు మెగా ఫ్యామిలీ అంటే అందులో అల్లు వాళ్ళు ఫ్యామిలీ కూడా ఉండేది. కానీ బన్నీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని అంచెలంచెలుగా ఎదుగుతున్నప్పటినుంచి రెండు ఫ్యామిలీల మధ్య గ్యాప్ వచ్చినట్లుగా తెలుస్తుంది. మెగా హీరోలు అందరూ ఒక లెక్క, అల్లు అర్జున్ ఒక లెక్క అన్నట్టు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ కూడా మెగా టాగ్ ని తగిలించుకోవటానికి ఇష్టపడటం లేదు.

అల్లు రామలింగయ్య మనవడిగానే, ఐకాన్ స్టార్ గానే పిలిపించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆ వార్తలు నిజమే అంటూ తాజాగా మరొక సంఘటన జరిగింది. అదేంటంటే నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కి లావణ్య త్రిపాఠి కి ఎంగేజ్మెంట్ అయిన సంగతి తెలిసిందే. అందుకు చిరంజీవి కాబోయే దంపతులిద్దరిని ఇంటికి ఆహ్వానించి గ్రాండ్ గా పార్టీ అరేంజ్ చేశాడు. అందులో మెగా కాంపౌండ్ మొత్తం జాయిన్ అయింది కేవలం ఇద్దరు తప్ప.

ఒకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే మరొకరు ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్. పవన్ కళ్యాణ్ కి అటు సినిమాలు ఇటు రాజకీయాలు అందుకే ఖాళీ లేక రాలేదు అనుకోవచ్చు కానీ అల్లు అర్జున్ సిటీలోనే ఉండి కూడా ఫంక్షన్ కి ఎటెండ్ అవ్వలేదు. ఆ తర్వాత అల్లు అర్జున్ తన ఇంటికి కాబోయే వధూవరులైన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి లను ఆహ్వానించి గ్రాండ్గా పార్టీ ఇచ్చాడు.

ఈ పార్టీలో నితిన్, రీతు వర్మతో సహా చాలామంది హాజరయ్యారు.అయితే అల్లు అర్జున్, రామ్ చరణ్ మధ్య గ్యాప్ ఉన్నట్టు రుజువు చేసే మరొక సంఘటన ఇక్కడ జరిగింది. అది ఏమిటంటే ఈ పార్టీకి రాంచరణ్ అటెండ్ అవ్వలేదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చరణ్ కి బన్నీకి పడటం లేదు అంటూ బోలెడన్ని వార్తలు పుట్టుకొస్తున్నాయి. అయితే అందులో నిజా నిజాలు ఏమిటో అఫీషియల్ గా తెలిస్తేనే కానీ చెప్పలేం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -