Ram Charan-Upasana: పిల్లలు పుట్టకపోతే రామ్ చరణ్ ఉపాసన అలా చేయాలనుకున్నారా.. నిజంగా గ్రేట్ అంటూ?

Ram Charan-Upasana: తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా వారసుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి చిరంజీవి ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదిగి స్టార్ హీరోగా సక్సెస్ అందుకున్నారు. ఇక ఈయన వారసుడిగా రాంచరణ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తండ్రిని మించిన తనయుడు అనే పేరు సంపాదించుకున్నారు.

రామ్ చరణ్ ఫాన్ ఇండియా స్థాయిలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా ప్రస్తుతం కెరియర్ పరంగా వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా రామ్ చరణ్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారని చెప్పాలి. ఇక ఈయన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్న విషయం మనకు తెలిసిందే.

ప్రస్తుత కాలంలోని యంగ్ హీరోస్ అందరూ కూడా పెళ్లిళ్లు చేసుకుని రెండు మూడు సంవత్సరాలకు విడాకులు తీసుకొని విడిపోతున్నారు. కానీ రామ్ చరణ్ దాదాపు 11సంవత్సరాలుగా తమ వైవాహిక జీవితంలో ఏ విధమైనటువంటి గొడవలు కూడా లేకుండా ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఎందరితో ఆదర్శంగా ఉన్నారు. ఇక ఈ దంపతులకు పెళ్లయిన పది సంవత్సరాలకు కుమార్తె జన్మించిన సంగతి తెలిసిందే.

ఇలా పెళ్లయిన తర్వాత చిన్నారి జన్మించడంతో చిన్నారికి క్లీన్ కారా అని నామకరణం కూడా చేశారు. అయితే పెళ్లయిన ఇన్ని సంవత్సరాలకు వీరికి పిల్లలు కాకపోవడంతో చాలామంది వీరికి పిల్లలు పుట్టరని కూడా అనుకున్నారు. అయితే తమకు పిల్లలు కనుక పుట్టకపోయి ఉంటే ఒక అమ్మాయిని దత్తత తీసుకొని పెంచుకోవాలని ఉపాసన రాంచరణ్ దంపతులు నిర్ణయం తీసుకున్నారట. వీరికి చిన్నారి జన్మించడంతో ఆ ఆలోచనను విరమించుకున్నారని, అయినప్పటికీ వీరు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఎందరికో సాయంగా నిలిచారని చెప్పాలి. ఏది ఏమైనా ఉపాసన రాంచరణ్ చిన్నారిని దత్తత తీసుకోవాలనే ఆలోచన చేయడం నిజంగా గ్రేట్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -