Ram Charan – Upasana: భార్య నుదిటి పై కుంకుమ దిద్ది ఆశీర్వదించిన రామ్ చరణ్!

Ram Charan – Upasana: మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో మనందరికీ తెలిసిందే. ఈమె రాంచరణ్ సినిమాలకు సంబంధించిన విషయాలను మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య సూత్రాలను కూడా సోషల్ మీడియా వేదిక అందరితో పంచుకుంటూ ఉంటారు. ఇలా ఒకవైపు మెగా ఇంటి బాధ్యతలను చేపట్టి మరోవైపు అపోలో హాస్పిటల్ బాధ్యతలను కూడా ఎంతో చక్కగా నిర్వర్తిస్తూ బిజీగా ఉన్నారు.

ఇలా వృత్తిపరమైన జీవితమే కాకుండా వ్యక్తిగత జీవితానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఏ మాత్రం సమయం దొరికిన హాలిడే వెకేషన్ వెళ్తూ సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు.ఇకపోతే ఏదైనా పండుగ వచ్చినా స్పెషల్ డే వచ్చిన పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేసుకోవడం మనం చూస్తుంటాము. ఇలా కుటుంబ సభ్యులందరూ ఒక చోట చేరి పెద్ద ఎత్తున పండుగలను జరుపుకుంటూ ఉంటారు.

తాజాగా ఉపాసన కృష్ణాష్టమి వేడుకలను అలాగే శ్రావణ శుక్రవారం కావడంతో శుక్రవారం వ్రత పూజలు కూడా ఆచరించారు. తన ఇంట్లో దేవుడి గదిని ఎంతో అందంగా అలంకరించి స్వామివారికి పండ్లు ఫలహారాలను నైవేద్యంగా సమర్పించి పూజ జరుపుకున్నటు వంటి ఫోటోని షేర్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ ఫోటోలో రామ్ చరణ్ ఉపాసన నుదిటి పై కుంకుమ పెట్టి తనని ఆశీర్వదించినట్టు తెలుస్తుంది.

ఇలా సాంప్రదాయబద్ధంగా పండుగలు జరుపుకుంటూ ఆ పండుగలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్ అవుతుంది. అయితే ప్రస్తుతం ఉపాసన షేర్ చేసిన ఈ ఫోటో ఎంతో చూడముచ్చటగా ఉంది.ఇక ఈ ఫోటో చూసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక ప్రస్తుతం సినిమా షూటింగులు బంద్ కావడంతో హీరోలందరూ ఇంటికే పరిమితమయ్యారు. రామ్ చరణ్ కూడా తన ఫ్యామిలీతో కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -