Game Changer: రామ్ చరణ్ లీక్ సాంగ్ ఇంత దరిద్రంగా ఉందేంటి.. గేమ్ ఛేంజర్ పరువు పోతుందంటూ?

Game Changer:  ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న పాన్ ఇండియన్ సినిమాలలో భారీ అంచనాలతో విడుదల కాబోతున్న చిత్రం గేమ్ చేంజర్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ ఇద్దరు కలిపి సినిమా తీస్తున్నారు అన్న విషయం తెలియగానే మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరూ బాగా ఆరాటపడ్డారు. ఈ సినిమా షూటింగ్ గత ఏడాది మొదలైంది. అనుకోని పరిస్థితుల వల్ల షూటింగ్ డిలే అవుతూ వచ్చింది.

ఈపాటికి సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమాని శంకర్ తను అంతకన్నా ముందే ప్రారంభించిన కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ షూటింగ్ చేయడం కోసం వాయిదా వేశారు. నెలకి 15 రోజులు గేమ్ చేజర్ 15 రోజులు ఇండియా 2 షూటింగ్ చేసుకుంటూ వచ్చారు. అయితే శంకర్ సినిమాలో పాటలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సినిమాకు ఎంత ఖర్చు పెడతారో పాటలకు కూడా అంతే ఖర్చు పెడతారు.

కాగా తాజాగా గేమ్ చేంజెర్ సినిమాలో ఒక పాట లీక్ అయింది. ‘జరగండి.. జరగండి’ అని తమన్ కంపోజ్ చేసిన ఈ పాట పరమ చండాలంగా ఉంది. ఈ పాట అసలు ఆ సినిమాలోదేనా అంటే నమ్మడానికి కూడా మనకి ఆశ్చర్యం వేస్తుంది. అయితే ఈ సినిమా పిఆర్ టీం అసలు ఇది ఈ సినిమాలో పాటే కాదు ఇంత చెత్త పాటలు శంకర్ ఓకే చేయరు.

రామ్ చరణ్ కెరీర్ లోనే బెస్ట్ ఆల్బమ్ గేమ్ చేజర్ గా నిలుస్తుందని సోషల్ మీడియా ద్వారా చెప్పారు. ఈ సినిమాకి కథానాయకగా కియారా అద్వానీ నటించగా ఈ సినిమా గురించి అడిగిన ప్రతిసారి తను చాలా ఎక్సైటెడ్ అయి సినిమా చాలా అద్భుతంగా చిత్రీకరించబడుతుంది అని అందరికీ ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో అని ప్రేక్షకులు అందరూ తెగ ఆరాట పడిపోతున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -