Ram Charan: వైరల్ అవుతున్న రామ్ చరణ్ సంచలన వ్యాఖ్యలు!

Ram Charan: మేగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ ఆర్ఆర్ఆర్ తర్వాత ఒక రేంజ్ లోకి వెళ్ళిపోయింది. కెరీర్లో సినిమాలన్నీ సౌత్ డైరెక్టర్లతోనే తీసినా కూడా రామ్ చరణ్ బేస్ మాత్రం ఇప్పుడు ముంబైలోనే ఉంది. తన అపాయింట్మెంట్ కోసం బాలీవుడ్ స్టార్లు సైతం ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తరువాత రామ్ చరణ్ హీరోగా ఏ సినిమా కూడా ఇంకా రాలేదు. ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో కియార అద్వానీ హీరోయిన్ గా చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్ గురించి అప్డేట్లు ఏమీ ఉండడం లేదు.

 

కానీ రామ్ చరణ్ మీద మాత్రం మీడియా ఫోకస్ ఏ మాత్రం తగ్గట్లేదు. ఎందుకంటే అటు కెరీర్ లోని మరోవైపు పర్సనల్ లైఫ్ లో కూడా రామ్ చరణ్ ఇప్పుడు గోల్డెన్ ఫేస్ లో ఉన్నారు. ఈ మధ్యనే రామ్ చరణ్ ఉపాసనలకు ఒక కూతురు పుట్టింది. క్లీన్ కారా అని తనకు పేరు పెట్టారు దాని తర్వాత రామ్ చరణ్ దంపతులు ఎక్కడ కనిపించినా సరే మీడియా వాళ్ళ వెనకనే పరిగెడుతున్నారు.

అయితే రీసెంట్గా రామ్ చరణ్ దంపతులిద్దరూ ఫోర్బ్స్ ఫోటోషూట్లో పాల్గొన్నారు. ఆ ఫోటో షూట్ లో భాగంగా ఈ దంపతులు కొన్ని విషయాలను పంచుకున్నారు. రామ్ చరణ్ కి ఈ స్టార్ డం అంతా కొంచెం భారంగా ఉండేదట కానీ దాన్ని బలంగా మార్చుకొని దానికోసం కష్టపడ్డారట. తన జీవితమంతా సినిమాలు చుట్టూనే ఉందని సినిమాల కోసం ప్రాణం పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పారు రామ్ చరణ్.

 

వ్యాపార విషయాలలో కూడా రామ్ చరణ్ తన సొంత నిర్ణయాలే తీసుకుంటారట. ఉపాసన కూడా వ్యాపారం గురించి మాట్లాడుతూ రాత్రులు నిద్ర పట్టలేనంత బిజీ వ్యాపారాన్ని ఎప్పుడూ చేయాలనుకోలేదు, ప్రశాంతంగా ఉంటే చాలు అని చెప్పుకొని వచ్చారు. వీళ్ళిద్దరి మాటలు వింటే కపుల్ గోల్స్ లా ఉన్నాయి, ఆదర్శ దంపతులు అంటూ ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -