Raghu Rama Krishna Raju: రామరామ రఘురామ.. సొంతూరికి వెళ్లాలంటే ఇలాంటి పరిస్థితా?

Raghu Rama Krishna Raju: నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు గురించి మనందరికీ తెలిసిందే. తరచూ ఏదోక విషయంతో ఈయన వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఎక్కువగా టీడీపీ మీద విమర్శలు గుప్పిస్తూ లేనిపోని కాంట్రవర్సీలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈయన పేరు సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. అందుకు గల కారణం కూడా లేకపోలేదు.. అదేమిటంటే తనకు రక్షణ కల్పించాలి అంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

 

సంక్రాంతి సందర్భంగా తాను సొంతూరుకి వెళ్తానని, అందుకు గాను తనకు రక్షణ కల్పించాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రఘురామపై పోలీసులు ఇప్పటికే 11 కేసులు పెట్టారని, మరో కేసు పెట్టే అవకాశం వుందని ఆయన తరపు న్యాయవాదులు ఉమేశ్ చంద్ర, వైవీ రవి ప్రసాద్‌లు పిటిషన్‌లో పేర్కొన్నారు. మరోసారి రఘురామకృష్ణంరాజుపై తప్పుడు కేసులు పెట్టే అవకాశం ఉందని, పోలీసులు నిబంధనలు పాటించేలా ఆదేశాలు ఇవ్వాలని వారు న్యాయస్థానాన్ని కోరారు.

ఆర్నేష్ కుమార్ కేసులో 41 ఏ నిబంధనలు పాటించాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను న్యాయవాదులు ప్రస్తావించారు. ఇది ఇలా ఉంటే మరొకవైపు రఘురామ కృష్ణంరాజు పిటిషన్‌కు విచారణ అర్హత లేదని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు. కేసు నమోదై, 7 ఏళ్ల లోపు శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్లు అయితేనే 41ఏ నిబంధనలు వర్తిస్తాయని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా ఆయనపై ఎలాంటి కేసులు పెట్టలేదని తాజాగా వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును శుక్రవారం వెలువరిస్తామని తెలిపింది. మరి నేడు ఈ విషయంలో తీర్పును ఏమని వెల్లడిస్తుందో చూడాలి మరి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -