Raghu Rama: ఎన్నికల్లో పోటీ విషయంలో తగ్గేదేలే.. రఘురామ వ్యాఖ్యల వెనుక అసలు మర్మమిదేనా?

Raghu Rama: వైసీపీ రెబల్ ఎంపీగా రఘురామకృష్ణ రాజు నర్సాపురం ఎంపీగా పోటీ చేసి ఎన్నికలలో గెలుపొందారు. అయితే వైసిపి పార్టీ తరఫున గెలుపొందినటువంటి రఘురామకృష్ణరాజు ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉంటూ సొంత పార్టీ పైనే తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు అయితే ఎన్నికలలో ఈయనకు తప్పకుండా నరసాపురం నుంచి ఎంపీగా టిడిపి పార్టీ నుంచి తనుకు టికెట్ వస్తుందని ఆశించారు కానీ ఈయనకు మాత్రం టీడీపీ నుంచి భారీ షాక్ తగిలిందని చెప్పాలి.

నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా మాత్రమే కాకుండా ఏ స్థానంలో కూడా ఈయనకు ఎంపీగాను అలాగే ఎమ్మెల్యేగాను టికెట్ కేటాయించలేదు. దీంతో రఘురామకృష్ణం రాజు తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు. నాకు టికెట్ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి తెరవెనక చాలా రాజకీయాలు చేశారంటూ కూడా విమర్శలు చేశారు.

ఇకపోతే తాజాగా విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నటువంటి రఘురామకృష్ణం రాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు అయితే తనకు ఎన్నికలలో సీటు కేటాయించకపోయిన తాను తప్పకుండా పోటీ చేస్తానంటూ ఈ సందర్భంగా రఘురామకృష్ణం రాజు చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాన లేక ఎంపీగా పోటీ చేస్తానా ఎక్కడి నుంచి పోటీ చేస్తాను అనే విషయాల గురించి చెప్పకపోయినా తాను తప్పకుండా ఎన్నికలలో నిలబడతానని తెలియజేశారు.

ఇక తాను ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాను ఎమ్మెల్యేగా చేస్తున్నానా లేక ఎంపీగా చేస్తున్నానా అనే విషయాలన్నింటిని కూడా మరో మూడు రోజులలో తెలియజేయబోతున్నాను అంటూ ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈయన మాటలు బట్టి చూస్తుంటే ఎన్నికలలో పోటీ విషయంలో తగ్గేదే లేదన్న ధోరణిలో రఘురామకృష్ణ రాజు వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -