Ramoji Rao: డు యు వాంట్ టు కిల్ మీ.. రామోజీ సంచలన వ్యాఖ్యలు వైరల్!

Ramoji Rao: ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు రామోజీ రావు. గత కొద్ది రోజులుగా రామోజీరావు పేరు సోషల్ మీడియాలో మారుమోగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో రామోజీరావుకి సంబంధించి ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో రామోజీ మాట్లాడుతూ.. ఈ పరిస్థితి నాకెప్పుడూ రాలేదు. బహుశా ఇది కాలమహిమో, జగన్ మహిమో కావొచ్చు అని తెలిపారు.ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మరింది.

ప్రస్తుతం తనకి ఒంట్లో బాలేదని, బ్రీతింగ్ ప్రాబ్లం ఉందని, కాబట్టి విచారణకి సహకరించలేనని అధికారులకి తెలిపారు. పర్లేదు సర్! టైం తీసుకోండి..కూర్చుంటాము అనగా డు యు వాంట్ టు కిల్ మీ. నాకు హార్ట్ పాల్పిటేషన్స్ వస్తున్నాయని అన్నారు రామోజీ. అయితే రామోజీ ఆ మాట మాట్లాడి ఉండాల్సింది కాదు. ఏమి విచారిస్తారో విచారించుకోండి అని ధైర్యంగా మాట్లాడాలి కానీ ఇలా మాట్లాడడం కాస్త హాస్యస్పదంగా ఉంది. జగన్ సర్కార్ డైనమైట్ పేల్చడంతో ఉండవల్లికి జవసత్వాలు పెరిగాయి.

 

రోజు ఒక ప్రెస్ మీట్ ప్రసంగంతో అరటిపండు ఒలిచి పెడుతున్నట్టు మార్గదర్శి కేసులోని లొసుగుల్ని ఆసక్తికరంగా చెబుతున్నారు. ఒక్కొక్కటిగా కేసులోని లొసుగుల్ని మీడియా ముందు బయట పెడుతున్నారు. అయితే చంద్రబాబు, జగన్, కమ్యూనిష్టులు, బీజేపీ వాళ్లు ఇలా ఎవ్వరూ మార్గదర్శి ఇష్యూ గురించి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు. నాగబాబు లాంటి కుహనామేధావి రామోజీ మీదకి సి.ఐ.డి పోలీసులు వెళ్లడం మహాపాపం అన్నట్టుగా పెద్ద పెద్ద ట్వీటు చేశారు. అది కాస్త పెద్ద కామెడీ అయి కూర్చుంది.

 

అసలు ఈ వ్యవహారాన్ని కొందరి చూస్తున్నట్టు రామోజీపై యుద్ధం, కమ్మవాడిపై కత్తికట్టడం, తెదేపా రాజగురువుపై సమరశంఖం అన్న యాంగిల్లో చూడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఉండవల్లి పదే పదే చెప్తున్నది ఒక్కటే తనకి రామోజీని జైలుకి పంపాలని ఏ మాత్రం లేదని, కేవలం ఆయన చేసింది తప్పని చెబితే చాలని, మళ్లీ ఇలాంటి ఆర్ధికనేరాలు మరొకరు చేయకుండా లీగల్ ప్రిసిడెన్స్ సెట్ చెయ్యాలన్నది ఆయన లక్ష్యమని చెప్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -