Ramya Krishna: మహేష్ బాబుకు చుక్కలు చూపించే పాత్రలో రమ్యకృష్ణ.. గుంటూరు కారం ఘాటు మామూలుగా ఉండదా?

Ramya Krishna: త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్న హ్యాట్రిక్ మూవీ గుంటూరు కారం. అతడు, ఖలేజా లాంటి సినిమాల తర్వాత ఈ కాంబోలో వస్తున్న సినిమా కాబట్టి ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమా కోసం మహేష్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలని క్రియేట్ చేసింది.

మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీ లీల నటిస్తుండగా, స్టైలిష్ అండ్ పవర్ ఫుల్ నెగిటివ్ రోల్ లో జగపతిబాబు నటిస్తున్నారు. ఈ పాత్ర కోసం ఆయన పూర్తిగా మేకోవర్ అయినట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో రమ్యకృష్ణ కూడా ఒక పవర్ఫుల్ పాత్ర పోషిస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే 19 సంవత్సరాల తర్వాత మహేష్ బాబు తో కలిసి నటిస్తుంది రమ్యకృష్ణ. 19 సంవత్సరాల క్రితం ఇద్దరు నాని సినిమాలో కలిసి నటించారు.

మళ్లీ మీ ఇద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవటం అనేది నిజంగా అభిమానులకి పండగే. మహేష్ బాబు ఆగస్టు వరకు అటు ఇటుగా డేట్స్ కేటాయించినా ఆగస్టు చివరి నుంచి గుంటూరు కారం సెట్స్ లోనే కనిపిస్తున్నారు. ఎలాగైనా ఈ సినిమాని సంక్రాంతి బరిలో దించాలని కష్టపడుతున్నారు. నిర్మాత నాగ వంశీ గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ అనౌన్స్మెంట్ దసరాకి ఉంటుందని చెప్పారు.

అలాగే రమ్యకృష్ణ గుంటూరు కారం కోసం ఆమె డిసెంబర్ మొదటి వారం వరకు డేట్స్ కేటాయించారని సమాచారం. త్రివిక్రమ్ ఈమె పాత్రని స్పెషల్ గా డిజైన్ చేశారంట. ఇందులో రమ్యకృష్ణ కారం కారంగా ఉండబోతుందని సమాచారం. సంక్రాంతి బడిలో దిగబోతున్న ఈ సినిమా ఎంతవరకు మహేష్ బాబు అభిమానులని ఆలరిస్తుందో చూడాలి. సంక్రాంతి బరిలో విజేతగా నిలుస్తుందో ఏదో తెలియాలంటే పండగ వరకు ఆగాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -