Rana Daggubati: గుడ్ న్యూస్ చెప్పబోతున్న రానా.. త్వరలో తండ్రి కాబోతున్నాడా?

Rana Daggubati: దగ్గుబాటి రానా హీరోగా పాన్ ఇండియా రేంజ్ లో ఎదిగిన విషయం అందరికీ తెలిసిందే. బాహుబలితో తన ఇమేజ్ ను అమాంతం పెంచేసుకున్నాడు రానా. హీరోగానే కాకుండా వైవిధ భరితమైన పాత్రలు చేస్తూ సత్తా చాటుతున్నాడు. నిర్మాతగా కూడా మారి అనేక చిత్రాలు అందిస్తున్నాడు. ఇటీవల ఓ ఇంటివాడయ్యాడు రానా. గతేడాది ఆగస్టు 8న రానా, మిహికా బజాజ్ ఒక్కటయ్యారు.

తల్లిదండ్రులు కాబోతున్నారా?

తాజాగా రానా దంపతుల గురించి ఓ వార్త హల్ చల్ చేస్తోంది. రానా, మిహిక దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారట. దీంతో దగ్గుబాటి కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తోంది. త్వరలోనే అభిమానులకు శుభవార్త అందిస్తారని తెలుస్తోంది. రానా, మిహిక దంపతులు పెళ్లయ్యాక కొంత కాలం పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట. ఇందులో భాగంగానే వారి పర్సనల్ ఫొటోలను డిలీట్ చేశారు.

అయితే, ఫొటోలు తీసేయడంతో వారిద్దరూ విడిపోతున్నారనే పుకార్లు షికార్లు చేశాయి. వాటన్నింటికీ చెక్ పెడుతూ.. రానాతో కలిసి ఉన్నఫొటోను మిహిక తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకున్నారు. దీంతో వీరిపై వస్తున్న వదంతులన్నీ పటాపంచలయ్యాయని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

తెలుగు సినిమాలో దగ్గుబాటి ఫ్యామిలీకి ప్రత్యేక చరిత్ర ఉంది. రామానాయుడు స్టూడియోతో వేలాది మంది ఆర్టిస్టులుగా, హీరోయిన్లుగా అవతరించారు. ముఖ్యంగా హీరోయిన్లను చాలా మందిని అందించింది రామానాయుడు స్టూడియో. నిర్మాతగా తనదైన ముద్ర వేశారాయన. ఆయన వారసత్వాన్ని సైతం తనయుడు సురేష్ బాబు కొనసాగిస్తున్నారు. మరోవైపు విక్టరీ వెంకటేశ్ కూడా అగ్ర హీరోగా కొనసాగుతున్నారు. బాబాయ్ వెంకటేశ్ తో కలిసి రానా నటించిన వెబ్ సిరీస్ త్వరలోనే విడుదల కానుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -