Balayya: బాలయ్య సినిమాల్లో రాయలసీమను తప్పుగా చూపించారా?

Balayya: రాయలసీమంటే రక్తపాతమేనా అనే విధంగా ఈ రోజుల్లో సినిమాలు వస్తున్నాయని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. “వీర సింహా రెడ్డి” సినిమా చూస్తే రాయలసీమ వాళ్లకి కొంచెం కూడా కోపం రావడం లేదని నెట్టింట కామెంట్లు ప్రత్యక్షం అవుతున్నాయి. ఎందుకంటే అప్పట్లో రామగోపాల్ వర్మ “కడప” పేరుతో ఒక సినిమా చేసినప్పుడు రాయలసీమ సంఘాలవాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. భర్త ముందే భార్యని రేప్ చేయడం లాంటి సీన్లు ఇందులో ఉన్నా కూడా ఈ సినిమాకు యూ/ఎ సర్టిఫికెట్ ఇవ్వడం ఏంటని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

 

బాలకృష్ణ ప్రాతినిధ్యం వహించేది రాయలసీమలోని హిందూపురం కావడంతో గతంలో తన తండ్రి అదే నియోజకవర్గం నుంచి పలు సార్లు ఎన్నికవ్వడం వల్ల ఆ ప్రాంత పరిస్థితులనే సినిమాల్లో చూపించాలని చూస్తున్నారు. రాయలసీమంటే ఫ్యాక్షననీ, వెనుకబాటు తనమనీ, అక్కడ లా అండ్ ఆర్డర్ ఉండదని, అంతా ఊరి పెద్ద చేతి గొడ్డలిలోనే ఉంటుందనే విధంగా ఇంకా కథలు వస్తుండటం ఏంటని మరికొందరు ఫైర్ అవుతున్నారు.

 

వీరసింహారెడ్డి సినిమాలో “సీమలో ఎవ్వరూ గొడ్డలి పట్టకూడదని నేను గొడ్డలి పట్టా..” అని ఇందులో ఒక డైలాగు ఉండటంతో దీనిపై కొందరు విరుచుకుపడుతున్నారు. ఇది తన అభిమానులకు గొడ్డలి పడ్డటం నేర్పేలా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

 

ఆ మధ్య ఒకసారి ఒక ఆడియో ఈవెంట్లో ఆడది కనిపిస్తే ముద్దైనా పెట్టేయాలి, లేకంటే కడుపైనా చేసెయ్యాలని బాలయ్య చెప్పిన డైలాగ్ ఇంకా చాలా చోట్ల మారుమోగుతూనే ఉంది. తాజాగా వీరసింహా రెడ్డి పాత్రలో కూడా ఇలా జరిగిందని, పెళ్లి కాకుండానే ఒక ఆడదానికి ముద్దుపెట్టి కడుపు చేయడం ఏంటని నెటిజన్లు విమర్శిస్తున్నారు. వీరసింహారెడ్డి సినిమాను చూసిన కొందరు ఏ మాత్రం బాధ్యత లేని మైండుతో, నియంతృత్వ ధోరణితో రెచ్చిపోయి సినిమాలు తీశారని కామెంట్లు వినిపిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -