Realme C33: స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసిన ‘రియల్‌మీ’ ధరెంతో తెలుసా?

Realme C33: ఒకప్పుడు స్మార్ట్‌ఫోన్‌ కొనాలంటే భారీ ధరలు పలికేవి. ఎందుకంటే అందులో ఉంటే ఫ్యూచర్లు అలాంటివి. ప్రస్తుతం వివిధ రకాల కంపెనీలు కొత్త కొత్త ఫ్యూచర్లతో మార్కెట్‌లోకి వివిధ రకాల ఫోన్‌లను విడుదల చేస్తున్నారు. ఇప్పుడు రూ.10 వేలకు కూడా అన్ని ఫ్యూచర్లు ఉన్న ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. తాజాగా.. రియల్‌మీ నుంచి ఎంట్రీ లెవెల్‌లో తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోకి వచ్చింది.

రియల్‌మీ సీ–33 పేరుతో భారత మార్కెట్‌ లోకి అడుగుపెటిన ఫోన్‌ 5000ఎంఏహెచ్‌ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్‌ ప్రైమరీ కెమెరా, యూనిసాక్‌ ప్రాసెసర్, వాటర్‌ డ్రాప్‌–నాచ్‌ డిస్‌ప్లే, డ్యూయల్‌ కెమెరా సెటప్, సైడ్‌–మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ వంటి ఫీచర్లన్నీ ఈ మొబైల్‌లో ఉన్నాయి. రూ.10,000 కంటే తక్కువ ధరలో బడ్జెట్‌ ఫోన్‌ కొనాలనుకునే వారే లక్ష్యంగా ఈ ఫోన్‌ మార్కెట్‌లోకి విడుదల చేసినట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

గతంలో వచ్చిన రియల్‌మీ సీ–31కు అప్డేటెడ్‌ వర్షన్‌గా దీన్ని విడుదల చేశారు. రెండు వేరియంట్లలో రియల్‌మీ సీ–33ను లాంచ్‌ చేశారు. 3జీబీ + 32జీబీ ధర రూ.8,999 కాగా, 4జీబీ + 64జీబీ ధర రూ.9,999గా ఉంది. సెప్టెంబర్‌ 12 నుంచి ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఆక్వా బ్లూ, శాండీ గోల్డ్‌ మరియు నైట్‌ సీ ఇలా మూడు రంగులలో ఈ ఫోన్‌ ఉంటుంది.

ఫ్యూచర్స్‌ ఇవి..

1. 6.5 ఇంచెస్‌ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే

2. యూనిసాక్‌ టీ612 ప్రాసెసర్‌

3. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 5 మెగా

పిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా

4. డ్యూయల్‌ కెమెరా సెటప్‌ (50ఎంపీ + 0.3 ఎంపీ ఏఐ కెమెరా)

5. సైడ్‌–మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌

6. 5000ఎంఏహెచ్‌ బ్యాటరీ, 10 వాట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ ఉంటుంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -