Smartphone: అతిగా ఫోన్‌ వాడితే మీరు అలా అవ్వడం ఖాయం..

Smartphone: పూర్వపు కాలంలో వయస్సుపైబడితేనే ముసలి వారు అయ్యేవారు.కానీ.. ప్రస్తుత కాలంలో తినే తిండి, ఉపయోగించే వస్తువుల కారణంగా కొత్తకొత్త రోగాలు పుట్టుకొచ్చి యవ్వనంలోనే వృద్ధాప్యాన్ని చూపిస్తున్నాయని పలు అద్యయనాలు తెలిపాయి. సాధారణంగా మనుషులు, జంతువులను ప్రేమించాలి.. వస్తువులను వినియోగించుకోవాలి.. కానీ.. నేటి కాలంలో వస్తువులనే అపారంగా పేమించి.. మనుషులను వాడుకుంటున్నారు. ఎక్కువగా వస్తువులను ప్రేమిస్తున్నా వారు యవ్వనంలోనే అతి తొందరగా ముసలివాళ్లు అవుతున్నారంటూ వచ్చిన ఓ రిపోర్టులో షాక్‌కు గురి చేస్తోంది.

నేటికాలంలో స్మార్ట్‌ ఫోన్‌ మనిషి జీవితంలో ఓ భాగమైపోయింది. ఇంట్లో నుంచి బయటకు వెళ్లినప్పుడు పొరపాటున ఏదైనా మర్చిపోవచ్చు కానీ.. సెల్‌ఫోన్‌ మాత్రం మర్చిపోడు. అది లేకపోతే శరీర భాగంలో ఏదో ఒకటి కోల్పోయినట్లుగా అనిపిస్తోంది. స్మార్ట్‌ ఫోన్‌తో పాటు ఇయర్‌ ఫోన్స్, స్మార్ట్‌ వాచ్, ల్యాప్‌ట్యాప్‌తో పాటు ఇతర గాడ్జెట్స్‌ కారణంగా మానవళి మనుగడకు ముప్పు వాటిల్లుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా గాడ్జెట్స్‌ వల్ల వయస్సు మీద పడి అనేక సమస్యల్లో చిక్కుకుని కొట్టుమిట్టులాడుతున్నటుల అమెరికాకు చెందిన ‘ఒరెగాన్‌ స్టేట్‌ యూనివర్శిటీ’ అధ్యయనం ద్వారా తెలిసింది.

ఫ్రాంటియర్స్‌ ఇన్‌ ఏజింగ్‌ అనే జర్నల్‌లో స్మార్ట్‌ ఫోన్, ల్యాప్‌ ట్యాప్స్‌తో పాటు ఇతర గాడ్జెట్స్‌లను ఎక్కువగా వాడటంతో వాటి నుంచి ప్రతిభించించే నీలి రంగు వెలుతురు వల్ల త్వరగా యుక్త వయస్సు నుంచి వద్ధాప్యంలోకి జారుకుంటున్నట్లు ఒరెగాన్‌ యూనివర్సిటీ ప్రతినిథులు తెలిపారు.

ప్రతి రోజు టీవీ, ల్యాప్‌ ట్యాప్స్, స్మార్ట్‌ ఫోన్స్‌ వినియోగంతో మితిమీరిన కాంతి మనుషులు శరీరంపై పడుతుంది. తద్వారా శరీర కారణాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు మా రీసెర్చ్‌లో తేలింది. చర్మం, కొవ్వు కణాల నుంచి నాడికణాల (ఇంద్రియ న్యూరాన్లు) వరకు దుష్ప్రభావం చూపుతుందని యూనివర్సినీ ప్రొఫెసర్‌ జాడ్విగా గిబుల్టోవిచ్‌ వెల్లడించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -