CM KCR: రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య పెరిగిన గ్యాప్.. కేసీఆర్ అనూహ్య నిర్ణయం అందుకేనా?

KCR – Governor: ప్రగతిభవన్, రాజ్ భవన్ మధ్య గ్యాప్ మరోసారి బయటపడింది. సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ మధ్య నెలకొన్న విబేధాలు మరోసారి బహిర్గతమయ్యాయి. గత ఏడాదికాలంగా గవర్నర్, కేసీఆర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి వ్యవహారంతో ప్రభుత్వం, గవర్నర్ మధ్య వివాదం మొదలైంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డి పేరును ప్రభుత్వం నామినేట్ చేసింది. సామాజిక సేవ కోటా కింద ఆయన పేరును సూచించింది. కానీ గవర్నర్ కోటాలో పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ అంశాన్ని తమిళి సై తిరస్కరించి వెనక్కి పంపారు. దీంతో అప్పటినుంచి గవర్నర్, కేసీఆర్ మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తోంది.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు స్టార్ట్ అవుతాయి. కానీ గవర్నర్ ప్రసంగాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, గవర్నర్ పర్యటలకు ప్రభుత్వం ప్రొటోకాల్ పాటించకపోవడంతో ఇద్దరి మధ్య విబేధాలు మరింత రచ్చకెక్కాయి. కేసీఆర్ ప్రభుత్వంపై గవర్నర్ బహిరంగంగా విమర్శలు చేయడం, దానికి టీఆర్ఎస్ నేతలు కూడా కౌంటర్ ఇవ్వడం చర్చనీయాంశం అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వంపై మోదీ, అమిత్ షాలకు గవర్నర్ ఫిర్యాదు చేయడం, ప్రజల సమస్యలపై గవర్నర్ నేరుగా స్పందించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించడంతో రాజ్ భవన్, ప్రగతిభవన్ మధ్య గ్యాప్ మరింత పెరుగుతూ వస్తోంది.

ఇటీవల జరిగిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు రాజ్ భవన్ కు కేసీఆర్ వెళ్లారు. అయితే ప్రొటోకాల్ ప్రకారమే వెళ్లినట్లు టీఆర్ఎస్ నేతలు చెప్పుకొచ్చారు. అయితే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్ లో గవర్నర్ ఏర్పాటు చేసిన ఎట్ హోం కార్యక్రమానికి కేసీఆర్ హాజరుకాకపోవడం చర్చనీయాంశంగామారింది. కేసీఆర్ హాజరు కావాల్సి ఉంది. కేసీఆర్ వస్తారేమోనని గవర్నర్ వెయిట్ చేశారు. కానీ చివరి నిమిషంలో కేసీఆర్ రద్దు చేసుకున్నారు. మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఎవరూ హాజరుకాలేదు. టీఆర్ఎస్ నుంచి ఎల్.రమణ మాత్రమే హాజరయ్యారు. ఇక ప్రభుత్వ తరపన సీఎస్ సోమేశ్ కుమార్ హాజరయ్యారు.

ఇక హైకోర్టు న్యాయమూర్తులు, పలువురు ప్రభుత్వ అధికారులు ఎట్ హోం కార్యక్రమానికి హాజరయ్యారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు కూడా హాజరయ్యారు. కానీ చివరి నిమిషంలో కేసీఆర్ దూరం కావడం చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా ప్రొటోకాల్ విషయంలో ప్రభుత్వ వైఖరిని గవర్నర్ తమిళి సై ఎత్తి పొడుస్తున్నారు.అలాగే ప్రజల సమస్యలపై నేరుగా స్పందిస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ విషయంలో టీఆర్ఎస్ నేతలు కూడా గవర్నర్ తీరుపై విమర్శలు కరిపిస్తున్నారు. గవర్నర్ తో ఉన్న గ్యాప్ కారణంగానే ఎట్ హోం కార్యక్రమానికి కేసీఆర్ హాజరుకాలేదని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -