Relationship Tips: ఇలాంటి అలవాట్లు మగవాళ్లకు ఉంటే ఆడవాళ్లకు అస్సలు నచ్చవట!

Relationship Tipsస్త్రీలకు, పురుషులకు అనేక వ్యక్తిగత అలవాట్లు ఉంటాయి. పెళ్లి కాక ముందు వరకు వీటితో పెద్దగా ఇబ్బంది లేకపోయినప్పటికీ పెళ్లయ్యాక తమ భాగస్వామి అలవాట్లతో కొందరు ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలో వాటిని మానుకోవడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో పెళ్లికి ముందే లేదంటే ఓ రిలేషన్‌షిప్‌కు ముందుగానే భాగస్వామికి ఏ అలవాట్లు ఇష్టం ఉండదో తెలుసుకొని తదనుగుణంగా జీవన శైలిని మార్చుకోవాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు.

ఇదే అంశంలో అసలు మగాళ్లలో స్త్రీలకు నచ్చని అలవాట్లు ఏంటనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఒక వ్యక్తి సంపూర్ణంగా జీవించాలనే నియమం ఏమీ ఉండదు. ప్రతి వ్యక్తిలో కొన్ని నెగిటివ్‌ అలవాట్లు, కొన్ని పాజిటివ్‌ అలవాట్లు ఉంటాయి. ఇవి అవతలి వ్యక్తికి నచ్చకపోవచ్చు. ఇలాంటి విషయాలను తెలుసుకోవడం ద్వారా బంధం బలంగా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవచ్చు.

ముఖ్యంగా మగవారి విషయంలో మహిళల ఎదుట ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవాలి. మగువల దృష్టిలో మంచి ఇమేజ్‌ను సొంతం చేసుకోవాలంటే కొన్ని నియమాలు పాటించాలి. స్త్రీలు ఇష్టపడని అలవాట్లు, ఇష్టపడే కొన్ని అలవాట్లు తెలుసుకోవాలి. మహిళలు ఓ సారి ప్లాన్‌ వేసుకుంటే దాన్ని మార్చడానికి ఇష్టపడరు. ఇలాంటి తరుణంలో వారికి చికాకు కలిగించేలా మళ్లీ మళ్లీ ప్రణాళికలు మార్చకుండా మగవారు జాగ్రత్త వహించాలి.

మంచి ప్రవర్తనతో ముందడుగు..
చెడు ప్రవర్తన స్త్రీలకు అస్సలు నచ్చదు. ఈక్రమంలో మంచి ప్రవర్తన కలిగి ఉండటం ద్వారా ఆడవాళ్లను ఇంప్రెస్‌ చేయవచ్చు. రెస్టారెంట్‌ వెయిటర్‌, కారు డ్రైవర్‌ ఇలాంటి వ్యక్తులపై కాస్త నెమ్మదిగా మాట్లాడుతూ డీసెంట్‌గా బిహేవ్‌ చేయాలి. ప్రేమను పది మందిలో బహిర్గతం చేయడాన్ని చాలామంది స్త్రీలు ఇష్టపడరు. ఇలాంటి అలవాట్లు మానుకోవాలి. ఎప్పుడూ క్లారిటీగా ఉండాలి. ఆత్మ విశ్వాసంతో ప్రవర్తించాలి. నిర్ణయాలు కాన్ఫిడెంట్‌గా తీసుకోవాలి. పురుషులు స్వతంత్రంగా ఉండటాన్ని మగువలు ఎక్కువగా ఇష్టపడతారు. కాబట్టి ఇలాంటి కొన్ని మార్పులు, ప్రవర్తన మార్చుకోవడం వల్ల మహిళలు మిమ్మల్ని ఇష్టపడతారని తెలుసుకోవాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -