Health Tips: వాడిన నూనె మళ్లీ మళ్లీ వాడుతున్నారా.. అయితే కష్టమే?

Health Tips: ఇంక రాబోయే సీజన్ పండుగల సీజన్. పండుగల సీజన్ ప్రారంభమైతే చాలు మనకు ముందుగా గుర్తుకొచ్చేది పిండిపదార్థాలు. ఈ పిండిపదార్థాలను తయారుచేయడానికి మనకు నూనే అవసరం అవుతుంది . అయితే ఈ నూనెను వాడిన తరువాత అలాగే ఉంచుతారు. అవసరం వచ్చినప్పుడు మళ్లీ ఉపయోగిస్తారు. మాములుగా అందరి ఇంట్లో చేసేది ఇదే.

ఉపయోగించిన నూనెని మళ్లీ మళ్లీ వేడి చేయడం వల్ల అందులో ఎలాంటి రసాయనాలు ఉత్పన్నమవుతాయో తెలుసా..? నూనెను రెండు సార్లు వేడి చేయొచ్చు కాని అంతకంటే ఎక్కువ సార్లు వేడిచేయకూడదు.. వాడకూడదు. కానీ రెస్టారెంట్లు, డాబాలలో నూనె పూర్తిగా అయిపోయే వరకు వాడుతారు. ఇలా పదే పదే వేడిచేసిన నూనెతో వండిన ఆహార పదార్థాలను తినడం వల్ల వచ్చే సమస్యలు ఏమిటో చూడండి.

ఉపయోగించిన నూనె DNA ని మారుస్తుంది.. నూనెను చాలాసార్లు వేడి చేస్తే దాని ధర్మాలు మారుతాయి. అందులో ఉండే పోషకాలు విషపూరితం అవుతాయి.అంతేకాకుండా నూనెను ఎక్కువసేపు వేడిచేస్తే ఆ నూనె తీవ్రత మీ శరీరంపై కనిపిస్తుంది. దీని వాసన ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతుంది. వంట నూనెల పొగలో 200 కంటే ఎక్కువ రకాల వాయువులు ఉంటాయి. ఇవి శరీరానికి హాని చేస్తాయి.

అధిక మంటపై నూనెలో ఏదైనా వేయించినప్పుడు దాని నుంచి పొగ వస్తుంది. ఇది కొవ్వు ఆమ్లాలతో ఉన్న పొగ. దీని కారణంగా న్యుమోనియా, రినిటిస్ అలాగే ఊపిరితిత్తుల క్యాన్సర్, క్షయ, ఆస్తమా వంటి తీవ్రమైన వ్యాధులు సంభవిస్తాయి.అదే విధంగా ఉపయోగించిన నూనెను పదే పదే వాడటం వల్ల శరీరంలో జెనోటాక్సిక్, మ్యూటాజెనిక్, కార్సినోజెనిక్ కార్యకలాపాలు పెరుగుతాయి. కణాలలో అవాంతరాలు మొదలవుతాయి. వాటి విచ్ఛిన్నం వేగం పెరిగి క్రోమోజోమ్‌లు దెబ్బతింటాయని పలు పరిశోధనలో వెల్లడించటం జరిగింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -