RGV-Ashureddy: రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా అషురెడ్డికి ఓకేనా?

RGV-Ashureddy: తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న రాంగోపాల్ వర్మ ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ షేక్ చేసే సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇలా ఒకానొక సమయంలో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను ప్రేక్షకులకు పరిచయం చేసిన రాంగోపాల్ వర్మ ప్రస్తుతం అలాంటి సినిమాలకు పూర్తిగా దూరమై కాంట్రవర్సీ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇలా ఏదో ఒక వివాదాస్పదమైన సినిమా ద్వారానో లేదా వివాదాస్పద సంఘటనల ద్వారానో వర్మ వార్తల్లో నిలుస్తుంటారు.

ఇకపోతే సోషల్ మీడియా ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకొని సెలబ్రిటీ హోదా అనుభవిస్తున్నటువంటి అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన బోల్డ్ ఫోటోషూట్స్ తో పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ ఎదుర్కొనే ఈమె తాజాగా రాంగోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ హాట్ టాపిక్ గా మారింది. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన డేంజరస్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమె తనని ఇంటర్వ్యూ చేశారు.

ఈ ఇంటర్వ్యూలో భాగంగా రామ్ గోపాల్ వర్మ అషు రెడ్డి పట్ల చాలా క్లోజ్ గా మూవ్ అవ్వడమే కాకుండా ఆమెను ముద్దులతో ముంచేత్తాడు.ఇలా వీరిద్దరూ కలిసి చేస్తున్నటువంటి ఈ బోల్డ్ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలామంది వీరి వ్యవహార శైలి పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.రాంగోపాల్ వర్మ తనని తాకరాని చోట తాకుతున్న ముద్దులు పెడుతున్న ఈమె చాలా మౌనంగా ఉంది.

రాంగోపాల్ వర్మతో ఇలా చేయటం వల్ల తనకు మంచి ఫేమ్ వస్తుందని భావించిందో ఏమో తెలియదు కానీ తాను మాత్రం వర్మ ప్రవర్తనకు ఏమాత్రం అడ్డు చెప్పలేదు. దీంతో ఈమె ఇష్ట ప్రకారమే వర్మ అలా ప్రవర్తించి ఉంటారని, ఆయన ఏం చేసినా అషు రెడ్డికి ఇష్టమేనని చాలామంది ఆమె పట్ల తీవ్రస్థాయిలో మండిపడుతూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా వర్మ తనతో ప్రవర్తించిన తీరు విషయంలో అందరూ కూడా
అషు రెడ్డిని తీవ్రస్థాయిలో విమర్శిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -