RK Roja: మార్గదర్శిలో చేరిన రోజా.. వైసీపీ నేతలే జగన్ పరువును గంగలో కలుపుతున్నారా?

RK Roja: త్వరలోనే ఏపీ మాజీ ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలపై ఎన్నో కుట్రలు చేశారు. ఈ కుట్రలో భాగంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ వ్యవహారం పై ఈయన దిక్కుమాలిన కేసులు పెట్టి మార్గదర్శి అధినేత రామోజీరావును మానసికంగా ఎన్నో చిత్రహింసలకు గురి చేశారు. అప్పటికే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి ఆయన మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో భాగంగా మరింత వేదనకు గురయ్యారు.

ఈ విధంగా లేనిపోని కేసులతో ప్రతిపక్ష నేతలను చిత్రహింసలకు గురి చేస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హైకోర్టు మొటిక్కాయలు వేసింది. జగన్ ఆశయాలకు అనుగుణంగా అప్పట్లో వైసీపీ నాయకులు రామోజీరావు మీద, మార్గదర్శి సంస్థ మీద నిప్పులు చెరిగారు. అయితే ఇక్కడ వైసిపి నేతలు కూడా మార్గదర్శి చిట్ ఫండ్ లో చేరటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

నేనూ మార్గదర్శలో చేరాను.. ఒక మోపెడ్ కొనుక్కున్నాను అనే యాడ్ అందరికీ గుర్తుండే వుంటుంది. అయితే ఇప్పుడు కనుక ఆ ప్రకటన షూట్ చేయాలి అంటే మంత్రి రోజాకు మించిన నటి మరొకరు లేరనే చెప్పాలి. ఎందుకంటే, రోజా కూడా మార్గదర్శిలో చేరారు. శుక్రవారం నాడు కదిరి స్థానానికి నామినేషన్ సమర్పించిన సందర్భంగా ఆమెకి సంబంధించిన ఆస్తులు, అప్పుల వివరాలు వెల్లడయ్యాయి.

రోజా మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థలో సభ్యురాలు. 2020లో ఆమె 40 లక్షల రూపాయల చిట్‌లో చేరారు. 2020 ప్రాంతం అంటే, వైసీపీ నాయకులు మార్గదర్శి మీద పగబట్టి వేధింపులు జరుపుతున్న సమయం. ఒకవైపు జగనన్న మార్గదర్శి మోసకారి సంస్థ అని ఆరోపణలు చేస్తుండగానే మరోవైపు ఆయన మాటే శాసనంగా భావించి రోజా మార్గదర్శిలో సభ్యురాలుగా చేరటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది ఇలా జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేస్తూ ఉండగా ఈమె మార్గదర్శిలో చేరడం అంటే జగన్ పరువు తీసినట్టేననే చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -