YS Jagan: వ్యతిరేకత ఉన్న మంత్రులకే టికెట్లు.. జగన్ తన గొయ్యి ఆయనే తవ్వుకున్నారా?

YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గత నాలుగు నెలలుగా ఎమ్మెల్యేలు ఎంపీల పనితీరుపై పెద్ద ఎత్తున సర్వేలు చేయించి వచ్చే ఎన్నికలలో అభ్యర్థుల జాబితాలను తయారు చేసిన సంగతి మనకు తెలిసిందే. 175 నియోజకవర్గాలలో పోటీ చేయబోయే ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో 88 మంది అభ్యర్థుల స్థానంలో కొత్త వారిని తీసుకోగా మిగిలిన వారందరికీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మాత్రమే అవకాశం కల్పించారు.

ఇకపోతే జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో ఎంతోమంది మంత్రుల పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. వీరికి ఈ ఎన్నికలలో సీట్లు ఇవ్వడం కూడా కష్టమేనని ఇదివరకు వార్తలు వచ్చాయి కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తమ పార్టీకి వ్యతిరేకత ఉన్నటువంటి మంత్రులకే తిరిగి టికెట్ ఇచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.

ఇలా అంబంటి రాంబాబు ఆర్కే రోజా సీదిరి అప్పలరాజు తమ్మినేని సీతారాం కొడాలి నాని వంటి వారి పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంది దీంతో వీరందరికీ టికెట్లు రావడం కష్టమేనని భావించారు. ఇక వీరికి టికెట్లు ఇస్తే తాము మద్దతు తెలుపమని సొంత పార్టీ నాయకులే డిమాండ్లు కూడా చేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి వాటన్నింటినీ లెక్కచేయకుండా వీరికి మరోసారి టికెట్లు ఇచ్చి ఎన్నికల బరిలోకి దింపుతున్నారు.

ఇలా వీరి పట్ల పూర్తిస్థాయిలో వ్యతిరేకత ఉందని తెలిసిన జగన్మోహన్ రెడ్డి వీరికి టికెట్లు ఇచ్చారు అంటే తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది. ఇప్పటికే జనాలలో వ్యతిరేకత ఉందని తెలిసి టికెట్లు ఇచ్చారు అయితే జనాలు తమ అభిప్రాయాన్ని ఓట్ల రూపంలో తెలియజేస్తారని దీంతో జగన్ ఇబ్బందులలో పడక తప్పదని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Election Commission: పింఛన్ల పంపిణీలో ఈసీ కీలక ఆదేశాలు.. జగన్ సర్కార్ కు ఇక చుక్కలేగా!

Election Commission: ఏపీలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చింది అయితే ప్రజలకు అందే సంక్షేమ పథకాలు అన్నిటిని కూడా వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే తీసుకువెళ్లారు అయితే...
- Advertisement -
- Advertisement -