RK Roja: జూనియర్ ఎన్టీఆర్‌ ఇప్పుడు గుర్తొచ్చాడా?.. వైరల్ అవుతున్న రోజా సంచలన వ్యాఖ్యలు!

RK Roja: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కీం స్కామ్ లో చంద్రబాబు నాయుడు అరెస్టు అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పెను దుమారం రేపింది. ఇది చంద్రబాబు నాయుడుకి అసలు సంబంధంలేని కేసు అయినా అరెస్టు చేశారు అంటూ పలువురు నేతలు తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు బావమరిదిలైనా బాలకృష్ణ, రామకృష్ణ అలాగే ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి సైతం ఈ చర్య అనాగరికం అంటూ తమ ఆవేశాన్ని వెళ్లగక్కిన విషయం అందరికీ తెలిసిందే.

అయితే ఎంతమంది ఎన్ని రకాలుగా స్పందిస్తున్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎలాంటి స్పందన తెలపకపోవడంతో జూనియర్ ఎన్టీఆర్ పై ఎప్పుడూ టార్గెట్ చేసే ఒక వర్గం వారు జూనియర్ ఎన్టీఆర్ ని తప్పుపడుతూ అనేక కామెంట్స్ చేశారు. అయితే వీటిపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు కానీ మంత్రి ఆర్కే రోజా మాత్రం తీవ్ర స్థాయిలో తన స్పందన తెలియజేశారు. కొడుకు లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ని తెలుగుదేశం నుంచి తరిమేసిన ఈ తండ్రి కొడుకులకి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గుర్తొచ్చాడా అంటూ ఎద్దేవా చేశారు.

2009 సంవత్సరంలో రాజకీయంగా జూనియర్ ఎన్టీఆర్ ని చంద్రబాబు నాయుడు ఎలా వాడుకున్నారో అందరికీ తెలిసిందే. పార్టీ ప్రచార నిమిత్తం వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ యాక్సిడెంట్లో ప్రాణం పోయే పరిస్థితి కూడా వచ్చింది. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ తెలుగు దేశంలో పార్టీలో ఉంటే ఎక్కడ తన కొడుకుకి ప్రాధాన్యత లేకుండా పోతుందో అని బయటికి తరిమేసాడు చంద్రబాబు. తన సొంత బావమరిది, అలాగే పార్టీ కోసం ఎంతో కష్టపడినా జూనియర్ ఎన్టీఆర్ తండ్రి అయిన హరికృష్ణ కి ఆఖరి దశలో సైతం ఎలాంటి పదవులు ఇవ్వకుండా కక్ష సాధింపు చర్యలు చేశారు.

అలాంటిది ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడట్లేదు అని తెలుగుదేశం వారు మాట్లాడుతూ ఉంటే నవ్వాలో, ఏడవాలో అర్థం కావడం లేదు. అంటే నీకు అవసరమైనప్పుడు పార్టీలోకి వచ్చి పవన్ కళ్యాణ్ లాగా వాళ్లు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివేసి వెళ్ళిపోవాలి. అంతేగాని అవతల వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ అవసరం లేదా అంటూ కామెంట్లు చేశారు. వాళ్లకి అవసరమైనప్పుడు సాయం చేస్తే మంచి వాళ్ళు లేకపోతే వాళ్లు వెధవలు అంటూ ఏడవడాలు. తెలుగుదేశం పార్టీ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నందుకు సిగ్గుపడాలి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మంత్రి రోజా. ఇప్పుడు ఈ కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -