Rohit Sharma: మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీల కన్నా రోహిత్ శర్మనే ఆ విషయంలో నెంబర్ వన్

Rohit Sharma: ఇండియాలో క్రికెట్ ని ఓ ఆట కన్నా మించి చూస్తుంటారు. అందుకే ఇండియాలో క్రికెట్ అంటే కేవలం ఆట కాదు, అదో మతం లాంటిది అని. అయితే ఈ క్రికెట్ లో టీమిండియా ఎంతో అద్భుతాలు చేస్తూ ఉంటుంది. టీమిండియా కోసం ఆడే క్రికెటర్లు ఒక్కొక్కరు ఒక్కో ప్రత్యేకతను చాటుతూ అభిమానుల్లో తమదైన స్థానాన్ని సంపాదిస్తుంటారు.

 

టీమిండియా క్రికెటర్లలో ఈ తరంలో ఎక్కువ మంది అభిమానిస్తున్న క్రికెటర్ల జాబితాలో కెప్టెన్ కూల్ గా పేరుగాంచిన మహేంద్ర సింగ్ ధోని, రన్నింగ్ మెషీన్ గా గుర్తింపు సాధించిన విరాట్ కోహ్లీ, హిట్ మ్యాన్ గా క్రీడాభిమానుల్లో సుస్థిర స్థానాన్ని పొందిన రోహిత్ శర్మలు ఖచ్చితంగా అందరి ఫేవరెట్ క్రికెటర్లుగా ఉంటారు. వీళ్లు టీమిండియాకు ఎంతో బలంగా నిలుస్తూ.. జట్టు గెలుపులో ఎంతో కీలకంగా ఉన్నారు.

 

టీమిండియా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన మహేంద్ర సింగ్ ధోని.. ఎన్నో మరుపురాని, చిరకాల స్వప్నాలను జట్టుకు, దేశానికి అందించాడు. అందుకే ధోని అంటే కోట్ల మంది తమ దైవంగా భావిస్తుంటారు. ధోని తర్వాత జట్టును పటిష్టంగా నడపడంతో పాటు క్రికెట్ లో కూల్ గా ఉన్న ధోని కాదు, నాలాంటి యాంగ్రీ మ్యాన్ కూడా ఉంటాడని విరాట్ కోహ్లీ ప్రత్యర్థి జట్టులకు చాటాడు. ఇక ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. బాల్ ను బౌండరీలు దాటించే హిట్ మ్యాన్ క్రీజ్ లో ఉన్నాడంటే ఆ ఉత్సాహమే వేరు.

 

టీమిండియా గెలుపోటముల్లో ఎంతో కీలకంగా ఈ ముగ్గురు ఆటగాళ్ల మధ్య చాలా విషయాల్లో పోటీ ఉంటుంది. రికార్డుల దగ్గరి నుండి ఎన్నో విషయాల్లో వీరి మధ్య పోటీ ఉంటూ ఉండగా.. తాజాగా ధోని మరియు కోహ్లీలను హిట్ మ్యాన్ దాటి నెంబర్ వన్ గా ఓ విషయంలో నిలిచాడు. ఇండియన్ క్రికెట్ మాత్రమే కాదు, ప్రపంచ క్రికెట్ గతిని మార్చి, పూర్తి కమర్షియల్ హంగులు క్రికెట్ కు అద్దిన ఐపీఎల్ విషయంలో ఈ రికార్డును హిట్ మ్యాన్ సాధించాడు.

 

ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ టీంకి కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ.. 15 సంవత్సరాల ఐపీఎల్ చరిత్రలో అతి ఎక్కువ వేతనాన్ని అందుకున్న క్రికెటర్ గా నిలిచాడు. మనీబాల్ నివేదిక ప్రకారం ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ ఐపీఎల్ చరిత్రలో మొత్తం రూ.178.6కోట్లు సంపాదించాడు. అవును అక్షరాల 178కోట్ల రూపాయలను రోహిత్ ఒక్క ఐపీఎల్ ద్వారానే సంపాదించాడు.

 

ఇక చెన్నై సూపర్ కింగ్స్ కు సూపర్ కెప్టెన్ గా వ్యవహరించిన మహేంద్ర సింగ్ ధోని.. ఈ విషయంలో రోహిత్ శర్మ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. ఐపీఎల్ మొత్తంలో ధోని.. రూ.176.84కోట్ల రూపాయలను ఆర్జించాడు. ఇక రోహిత్, ధోనిల తర్వాత స్థానాన్ని విరాట్ కోహ్లీ సాధించాడు. ఇతడు ఐపీఎల్ అన్ని సీజన్ల ద్వారా రూ.173.2కోట్లను సంపాదించి.. మూడో స్థానంలో నిలిచాడు.

Related Articles

ట్రేండింగ్

YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో జగన్ ను దోషిని చేసేలా దస్తగిరి ప్రయత్నం.. ఏమైందంటే?

YS Viveka Murder Case: గత ఐదు సంవత్సరాల క్రితం దారుణ హత్యకు గురైనటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పటికీ పరిష్కారం కాలేదని చెప్పాలి. ఈ కేసు సిబిఐ దర్యాప్తు...
- Advertisement -
- Advertisement -