Roja: రోజాకు ఇంతకు మించి అవమానం ఉండదు…భారీ షాక్ ఇచ్చిన జగన్…

Roja: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతల్లో సినీనటి రోజా ఒకరు. తెలుగుదేశం పార్టీలో తన రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభించి అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార టిడిపి పక్షాన్ని రోజా తన మాటలతో ఆటాడుకునేవారు. 2019 ఎన్నికల్లో మళ్ళీ నగరి నుండి ఎమ్మెల్యే కి ఎన్నికైన రోజా మంత్రి వర్గ విస్తరణలో పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

 

అయితే మంచి అయ్యాక రోజా చేసే పనులు బాగా హాట్ టాపిక్ అవుతున్నాయి. పర్యాటక శాఖ మంత్రిగా చేయాల్సిన పనులు మానేసి ఇతర బయట యాక్టివిటీస్ లో రోజు ఎక్కువగా పాల్గొంటూ ఆ వీడియోస్ బయటకు రావడం ప్రతిపక్షాలు ఆమెను విమర్శించడం తద్వారా వైసిపికి నష్టం చేయకూరడం జరుగుతుంది. తాజాగా బెంగళూరులో ఒక పబ్బుల్లో రోజా డాన్స్ చేస్తున్న వీడియో బయటికి వచ్చింది. ఒక మంత్రి స్థాయిలో ఉండి ఎటువంటి పనులు చేయడం ఏంటి అంటూ సామాన్య ప్రజలతో పాటు ప్రతిపక్షాల వారు కూడా రోజని గట్టిగా విమర్శించారు. ఇది రోజాతో పాటు వైసిపి కూడా బాగా డామేజ్ చేసింది.

అయితే తాజాగా వైసిపి లో టికెట్ల గందరగోళం నెలకొంది. వచ్చే ఎన్నికల్లో ఎవరికి సీట్లు దక్కుతాయి ఎవరికి దక్కవు అనే సందిగ్ధత నెలకొంది.ఈ కోవలోనే మంత్రి రోజాకి కూడా సీటు కష్టాలు మొదలయ్యాయి. ఏ చిన్న అవకాశం దొరికినా ప్రతిపక్షాలను టార్గెట్ చేసి తనదైన ప్రత్యేక శైలిలో విమర్శలు గుప్పించే రోజాను ఇప్పుడు సొంత పార్టీ నేతలే టార్గెట్ చేస్తున్నారు. ఇక నగరి నియోజకవర్గంలో సొంత పార్టీ నాయకులు రోజాను వ్యతిరేకిస్తున్నారు. ఇక మంత్రి పెద్దిరెడ్డికి రోజాకి మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఈసారి నగరిలో రోజాకి కాకుండా ఒక బీసీ అభ్యర్థికి సీటు ఇప్పించాలని మంత్రి పెద్దిరెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.రోజాకు నగరి టికెట్ ఉంటుందా? ఉండదా అన్న చర్చ పార్టీలో సాగుతుండగానే ఆమెకు జగన్ భారీ షాక్ ఇచ్చారన్న ప్రచారం జోరందుకుంది.

రోజాకు వైసిపి హైకమాండ్ షోకాజ్ నోటీసులు ఇచ్చిందని..24 గంటల్లో దీనిపై వివరణ ఇవ్వకుంటే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామనీ హెచ్చరించినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందింది. షాకాజ్ నోటీస్ ఎందుకు ఇచ్చారంటే ఆమె బెంగుళూరు పబ్ లో చేసిన హడావిడి పార్టీకి నష్టం కలుగుతుందని దాని మూలంగానే నోటీసు పంపించినట్లుగా తెలుస్తుంది. దీనిపై రోజా ఇచ్చే వివరణకి జగన్మోహన్ రెడ్డి సంతృప్తి చెందితే రోజాకి ఎటువంటి డోకా ఉండదు లేదంటే రోజాకి పార్టీ నుండి సస్పెన్షన్ తప్పదనే వాదన కూడా వినిపిస్తుంది. అయితే ఇదంతా మంత్రి పెద్దిరెడ్డి తెరవెనక నుండి చేస్తున్నారని అంటున్నారు. రోజాన తప్పించడానికే ఈ పబ్బు వ్యవహారం ఒక సాకుగా చూపుతున్నారని రోజాని వదిలించుకోవడానికి ఇదంతా జరుగుతుందని వైసిపి నాయకులు గుట్టుగా మాట్లాడుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -