RRR: ఆ మూవీ ఆర్ఆర్ఆర్ రికార్డులకు చెక్ పెట్టిందా?

RRR: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన అద్భుత చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి సంచనలం సృష్టటించిందో అందరికీ తెలిసిందే. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల రికార్డులు సృష్టించింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు సృష్టించింది. ఇటీవల జపాన్ లో కూడా విడుదలై సంచలనాలు నమోదు చేస్తోంది.

అలాంటి ఈ చిత్ర రికార్డుల్ని ఓ సినిమా దాటేసింది. అదే.. ది లెజెండ్ ఆఫ్ మౌలా జట్ మూవీ. పాకిస్తాన్ పంజాబీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ లో విడుదలైంది. రివెంజ్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ యూకే బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టించింది. సినిమాకు కాసుల వర్షం కురుస్తోంది. యూకేలో రాజమౌళి చిత్రం ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్ ను రెండు వారాల్లోనే బీట్ చేసింది.

లైఫ్ టైమ్ రికార్డులు బీట్ చేసి చూడండి..
ఇక పాకిస్తాన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్నారు. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను బీట్ చేసిందంటూ పోలిక చూపుతూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో భారత్ అభిమానులు కూడా దీటుగా స్పందిస్తున్నారు. ఒక్క యూకేలో కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ కలెక్షన్లను బీట్ చేసి చూపించాలని సవాల్ విసురుతున్నారు.

ది లెజెండ్ ఆఫ్ మౌలా జట్ కథ విషయానికొస్తే.. ఓ కుటుంబానికి చెందిన రివెంజ్ డ్రామాగా చెప్పొచ్చు. చిన్నప్పుడు జరిగిన అటాక్ నుంచి బయట పడిన హీరో, మరోచోట బతుకుతుంటాడు. కానీ అతడికి గతం వెంటాడుతూ ఉంటుంది. తర్వాత తన తల్లిదండ్రులను చంపిన వారిని ఎలా చంపుతాడనేదే ఈ సినిమా స్టోరీ.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -