Gargi Review: గార్గి సినిమా రివ్యూ

సాయి పల్లవిని చూసి జనాలు థియేటర్లకు వస్తుంటారు. ఆమె కనిపిస్తే చాలని అనుకునే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు. అలా అని ఆమె ఎక్కడా కూడా ఎక్స్‌పోజింగ్ చేయదు. కనీసం కాళ్లు, నడుమును కూడా చూపించదు. నటనతోనే అందరినీ కట్టిపడేస్తుంది. ఆమె నవ్వు, చూపులు చాలనుకుంటారు. కథ, నటనకు ప్రాధాన్యమిచ్చే సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గార్గి. ఈ సినిమా ఆడియెన్స్‌ను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం.

Sai Pallavi Gargi Movie Review And rating

కథ…

గార్గి (సాయి పల్లవి)ది మధ్య తరగతి కుటుంబం. తండ్రి ఓ అపార్ట్మెంట్‌లో సెక్యూరిటీ గార్డ్. తల్లి ఇంటి వద్దే దోశ, ఇడ్లి పిండిలు అమ్ముకుంటుంది. గార్గి ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పని చేస్తుంటుంది. ఇలా సాఫీగా సాగుతున్న గార్గి జీవితం ఒక్క రోజులో మారుతుంది. చిన్న పాపపై అత్యాచారం చేశాడనే ఆరోపణలతో గార్గి తండ్రిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఇక సమాజం గార్గి కుటుంబాన్ని వేలివేసినట్టుగా చూస్తుంది. తన తండ్రి ఎలాంటి తప్పులు చేయలేదని నిరూపించేందుకు గార్గి చేసిన ప్రయత్నం ఏంటి? ఆమెకు ఎదురైన సవాళ్లేంటి? మన చట్ట, న్యాయ వ్యవస్థల పని తీరు ఎలా ఉంటుంది? అనే ఎన్నో ప్రశ్నలకు సమాధానామే గార్గి.

నటీనటులు…

గార్గి సినిమా అంతా కూడా సాయి పల్లవి చుట్టే తిరుగుతుంది. సాయి పల్లవి నటనకు ఇదో ఉదాహరణగా నిలిచిపోతుంది. సాయి పల్లవి తప్పా ఇంకెవ్వరూ ఈ పాత్రను పోషించలేరని ఎన్నో సీన్లలో ఆమె నటన చాటి చెబుతుంది. అలాంటి సాయి పల్లవి గార్గితో మరోసారి మాయ చేసింది. ఇక ఈ చిత్రంలో లాయర్ పాత్ర, గార్గి తండ్రి పాత్ర, చిన్నారి తండ్రి పాత్రలు హైలెట్ అవుతాయి. కానీ మనం మాత్రం సాయి పల్లవిని మాత్రమే గుర్తుంచుకుని, తలుచుకుని థియేటర్ నుంచి బయటకు వెళ్తాం.

విశ్లేషణ…

గార్గి సినిమాతో దర్శకుడు ఎన్నో అంశాలను టచ్ చేశాడు. చిన్న పిల్లలపై జరిగే అత్యాచారాలు, కుటుంబ సభ్యులను కూడా నమ్మలేని స్థితిలో ఉన్నామని, కన్నతండ్రి కూడా కామాంధులుగా మారుతున్నారని, చట్టం న్యాయ వ్యవస్థలు పని చేసే తీరును స్పష్టంగా చూపించాడు. ఇక మీడియా ఇలాంటి వాటిపై ఎలా ఫోకస్ పెడుతుంది.. ఎలా దారి తప్పేలా చేస్తుంది.. తప్పొప్పులను మీడియా ఎలా మార్చేస్తోంది.. మీడియా ధోరణి ఎలా ఉంటుందో చూపించాడు.

ఇక గార్గి పాత్రతో దర్శకుడు చెప్పించాలనుకున్న సందేశం మాత్రం అందరినీ ఆకట్టుకుంటుంది.తప్పు చేసింది ఎవరైనా సరే వదలకూడదని చెప్పించాడు. ఈ పాత్ర సమాజంలోని ఎంతో మందికి స్పూర్తిగా నిలుస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి? సమాజం మనల్ని వేధించినప్పుడు ఎలా ధైర్యంగా నిలబడాలో చూపించాడు. ఈ కథ, కథనం, క్లైమాక్స్ చూస్తే ఎవ్వరికైనా సరే హృదయం బరువెక్కిపోతుంది. చివర్లో అందరూ నిశ్శబ్దంగా బయటకు వెళ్తారు.

గార్గి సినిమాకు కథ మెయిన్. దానికి తగ్గట్టుగా సాగే నేపథ్య సంగీతం, కెమెరా పనితనం అద్భుతంగా సాగింది. ఈ రెండు కూడా సినిమాను నిలబెట్టేశాయి. ఈ సినిమాను అతి తక్కువ బడ్జెట్‌లోనే తెరకెక్కించి అద్భుతమైన అవుట్ పుట్‌ను రాబట్టేశారు. నిర్మాణ విలువలు అద్బుతంగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్…

సాయి పల్లవి నటన
కథ, కథనం

మైనస్ పాయింట్స్…

స్లో నెరేషన్

రేటింగ్ 3.5/5

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -
సాయి పల్లవిని చూసి జనాలు థియేటర్లకు వస్తుంటారు. ఆమె కనిపిస్తే చాలని అనుకునే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు. అలా అని ఆమె ఎక్కడా కూడా ఎక్స్‌పోజింగ్ చేయదు. కనీసం కాళ్లు, నడుమును కూడా చూపించదు. నటనతోనే అందరినీ కట్టిపడేస్తుంది. ఆమె నవ్వు, చూపులు చాలనుకుంటారు. కథ, నటనకు ప్రాధాన్యమిచ్చే సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గార్గి. ఈ...Gargi Review: గార్గి సినిమా రివ్యూ