Sai Pallavi: రాజకీయ నాయకుడు కొడుక్కి వాచిపోయే రిప్లై ఇచ్చిన సాయి పల్లవి!

Sai Pallavi: సాయి పల్లవి తెలుగు ఇండస్ట్రీలో మొదటిగా ఫిదా చిత్రంతో పరిచయమై తన నటనతో, డాన్స్ తో, డైలాగులతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. ఆ తర్వాత సాయి పల్లవి కెరియర్లో వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఈ మధ్యకాలంలో సాయి పల్లవి ఎక్కువగా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తుంది. ఈమెకు తెలుగు ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీ అని పేరు. ఈ స్టార్ హీరోయిన్ తను ఎక్స్పోజింగ్ చేసే పాత్రలకు దూరంగా ఉంటుంది.

తను కేవలం సినిమాల మీద ఆసక్తితోనే నటిస్తున్నానని చాలా సార్లు చెప్పింది. గతంలో ఈమెకు ఎక్కువగా రెమ్యూనరేషన్ చేసే ప్రకటనలలో అవకాశాలు వచ్చినా కూడా ప్రజల ఆరోగ్యాలపై చెడు ప్రభావం చూపే యాడ్లలో తను నటించిననీ తెలియజేసింది. తను నటించిన సినిమాలలో నిర్మాతకు నష్టం వస్తే తన పారితోషకం లో సగం ఇచ్చేస్తుందట ఈ న్యాచురల్ బ్యూటీ. అయితే, సాయి పల్లవి ఎటువంటి విషయాన్నైనా మొహమాటం లేకుండా చెప్పేస్తూ ఉంటుంది. అందుచేత ఈమె చాలాసార్లు వివాదాల్లో ఇరుక్కుంది.

కొంతకాలం క్రితం సాయి పల్లవి ఇంటికి ఒక టాప్ పొలిటిషన్ రావడం తో వారికి ఊహించని షాక్ ఇచ్చినట్లు అయింది. సాయి పల్లవిని టాప్ పొలిటిషన్ కుమారుడు ఇష్టపడడంతో తన ఇంటి కోడలిగా చేసుకుంటానని సంబంధం మాట్లాడుకోవడానికి సాయి పల్లవి ఇంటికి వెళ్లినట్లు సమాచారం. సాయి పల్లవి ఈ సంబంధాన్ని చాలా సున్నితంగా తనకు ఇష్టం లేదు అని చెప్పి, తనకు ఇప్పట్లో వివాహం చేసుకునే ఆలోచన కూడా లేనట్లు తెలియజేసింది. ఒకవేళ నేను వివాహం చేసుకుంటే పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారిని మాత్రం అసలు చేసుకోనని మొహం మీదే చెప్పేసిందట. ఈ విషయం తెలిసి అభిమానులు సైతం షాక్ కి గురయ్యారు.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -