Sai Pallavi: సాయి పల్లవి పెళ్లి.. తెలుగబ్బాయే వరుడట!!

Sai Pallavi:  సాయి పల్లవి.. అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా రాణించింది. సాయిపల్లవి మలయాళం ప్రేమమ్ సినిమాతో చిత్ర పరిశ్రమకి పరిచయమైంది. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది. దక్షిణాది చిత్ర పరిశ్రమలో సాయి పల్లవి స్టార్ హీరోయిన్ రాణిస్తోంది. ఆమె హీరోల పాత్రలకు ధీటుగా ఉండే పాత్రలను ఎంచుకుంటూ తనదైన శైలిలో అభిమానులను అలరిస్తూ ఉంది. అంతేకాదు.. ఈ మధ్యకాలంలో సాయి పల్లవికి లేడీ పవర్ స్టార్ అన్న ట్యాగ్ లైన్ కూడా ఫ్యాన్స్ యాడ్ చేశారు.

ప్రస్తుతం సాయి పల్లవి చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఆమె రానా జంటగా నటించిన విరాటపర్వం సినిమా తర్వాత ఏ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఈ మధ్యకాలంలో వచ్చిన గార్గి సినిమా కూడా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందలేకపోయింది. విరాటపర్వం సినిమా ప్రమోషన్స్ భాగంగా.. సాయిపల్లవి తన వ్యక్తిగత విషయాలను తెలిపింది. ఆమె తన ప్రేమ విషయాన్ని గురించి వెల్లడించారు. అంతేకాదు.. నాన్ వెజ్ తిననని అన్నది. ఇక ప్రేమించిన వ్యక్తి కోసం చికెన్ షాప్‌లో నాన్ వెజ్ కొనుగోలు చేసి తనకి వండి పెడతానని ఆమె చెప్పుకొచ్చింది.

అలాగే ఆమె పెళ్లి విషయంపై మాట్లాడుతూ.. తెలుగు అబ్బాయినీ మాత్రమే చేసుకుంటాను.. లేకపోతే సింగిల్‌గానే ఉండి పోతాను అని చెప్పుకొచ్చింది. ఆమె పెళ్లి చేసుకునే వ్యక్తి కూడా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి అని, ఆమె ఇప్పుడు పరోక్షంగా హింట్ ఇస్తోంది. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో సింగిల్‌గా ఉన్న హీరో ఎవరంటూ సోషల్ మీడియా వేదికగా చర్చ నడుస్తోంది. ఇక సాయిపల్లవి చెప్పిన తెలుగు అబ్బాయి పెద్ద హీరోనా, చిన్న హీరోనా అంటూ ఆరా తీస్తున్నారు. మరోవైపు ఈ వార్తలో నిజం ఎంతవరకు ఉందంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఇంతకీ సాయిపల్లవి ఎవర్ని లవ్ చేస్తోందని అభిమానులలో సందేహాలు తలెత్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Raghu Rama Krishnam Raju: ఉండిపై ఉడుం పట్టు పట్టిన రఘురామ కృష్ణంరాజు.. అసెంబ్లీలో జగన్ కు వణుకేనా?

Raghu Rama Krishnam Raju: రఘురాం కృష్ణంరాజు కి కూటమి తరపున టికెట్ రాదు అనే భావించిన వైసీపీ వర్గం వారు సంబరాలు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే అనూహ్యంగా తెదేపా...
- Advertisement -
- Advertisement -