Venkatesh: స్టార్ హీరో వెంకటేశ్ ను ఆ స్టార్ డైరెక్టర్ చెంప దెబ్బ కొట్టారా.. అంత ఘోరంగా అవమానించారా?

Venkatesh:  మన తెలుగు ఇండస్ట్రీలో ఏ పాత్రకైనా క్షుణ్ణంగా ఒదిగిపోయే హీరోలు చాలా అరుదుగా ఉంటారు. అందులో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు దగ్గుబాటి రామానాయుడు నిర్మాతగా ఉన్నప్పుడు అతని కొడుకు అయిన దగ్గుబాటి వెంకటేష్ సినిమాల్లోకి అడుగు పెట్టారు. మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్నారు వెంకటేష్.

అలా అందర్నీ నవ్విస్తూ, ఏడిపిస్తూ యాక్షన్ సినిమాలు తీస్తూ, కామెడీ సినిమాలు తీస్తూ దేనినీ వదలకుండా అన్ని రకాల ప్రేక్షకులని ఆకట్టుకున్నారు. అప్పట్లో తెలుగులో టాప్ త్రీ హైయెస్ట్ కలెక్షన్స్ సినిమాలు తీస్తే అందులో చిరంజీవి సినిమా వెంకటేష్ సినిమా ఖచ్చితంగా ఉండవలసిందే. ఇప్పటికి 60 ఏళ్లు దాటినా కూడా బాక్స్ ఆఫీస్ లో ఈయన అందరికీ గట్టి పోటీ ఇస్తున్నారు అంటే ప్రేక్షకులు ఈయన్ని ఎంతలా ఆదరిస్తున్నారో తెలుసుకోవచ్చు.

వెంకటేష్ స్క్రిప్ట్ సెలక్షన్ కూడా చాలా బాగుంటుంది. ఈయన ఎన్ని సినిమాలు తీసిన బొబ్బిలి రాజా సినిమా మాత్రం మర్చిపోలేనిది. 20 రోజులు పాటు అడవిలోనే తీసిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలిచి అప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టేసింది. ఈ సినిమా వెంకటేష్ కెరీర్ లోనే అత్యంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలుచుంది. దీని గురించి ఒక తెలియని విషయం ఈమధ్య వెలుగులోకి వచ్చింది.

అదేంటంటే క్రూర మృగాల మధ్య షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒకరోజు వెంకటేష్ ఒక చెట్టు కింద నిద్రపోతున్నారట. ఆ సమయంలో ఒక విషపూరితమైన పురుగు వెంకటేష్ మొఖం మీద పడడంతో దర్శకుడు బి. గోపాల్ అది కుట్టడం వల్ల వెంకటేష్ కి ప్రమాదం వస్తుందేమో అని దాన్ని తరిమికొట్టే ప్రయత్నంలో హీరో చెంప మీద చేసుకున్నారట. నిద్రలో నుంచి లెగిసిన వెంకటేష్ జరిగిన విషయం అంతా తెలుసుకొని గోపాల్ కి కృతజ్ఞతలు చెప్పారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -