Sai Tej: నిహారికపై సాయితేజ్ చూపించిన ప్రేమకు షాకవ్వాల్సిందే.. ఏకంగా అతనికే వార్నింగ్ ఇచ్చాడుగా!

Sai Tej: తెలుగు ప్రేక్షకులకు మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గత కొద్ది రోజులుగా ఈమె రు సోషల్ మీడియాలో మారుమోగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తున్న నిహారిక పై దారుణంగా ట్రోలింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. మరి ముఖ్యంగా ఆమె విడాకులు తీసుకున్న తర్వాత ఆమెపై అదే పనిగా ట్రోల్స్ చేస్తూ నెగిటివ్ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు నెటిజన్స్. ఇలాంటి క్రమంలోనే నిహారిక పెట్టిన కామెంట్ ని టార్గెట్ చేస్తూ ఒక నెటిజెన్ ఆమె పరసనల్ లైఫ్ ని టచ్ చేసాడు.

రీసెంట్గా సాయిధరమ్ తేజ్ తన స్నేహితుడు సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ కోసం ఒక ప్రైవేట్ సాంగ్ లో నటించాడు. స్వాతి రెడ్డితో కలిసి సత్యా అనే సాంగ్ లో నటించి మెప్పించాడు. ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూ దూసుకుపోతోంది. అయితే ఈ సాంగ్ అప్డేట్ ఇస్తూ సాయిధరమ్ తేజ్ ఒక పోస్ట్ చేసాడు. ఆ పోస్ట్ కి నిహారిక రిప్లై ఇస్తూ ఈ సాంగ్ చూడడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అంటూ కామెంట్ పెట్టింది..సాయి తేజ్ పెట్టిన పోస్ట్ కి నిహారిక ఇచ్చిన రిప్లై కి అసలు ఆ నెటిజన్ అంత రియాక్షన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు.

 

కానీ కావాలనే టార్గెట్ చేస్తూ నిహారిక పరసనల్ లైఫ్ ని టచ్ చేసాడు. వీటి పై పెట్టిన ధ్యాస నీ ఫ్యామిలీ పై పెట్టి ఉంటే బాగుండేది అంటూ నిహారిక వ్యక్తిగత జీవితాన్ని గురించి ప్రస్తావించాడు. దీంతో సాయి ధరమ్ తేజ్ కి తీవ్ర కోపం వచ్చింది. అంతే వెంటనే రియాక్ట్ అవుతూ.. నోరు మూసుకొని వెంటనే కామెంట్ డిలీట్ చెయ్ అంటూ ఆకతాయికి దిమ్మతిరిగే వార్నింగ్ ఇచ్చాడు. తేజు ఫ్యాన్స్ కూడా సదరు నెటిజన్ పై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఎందుకు ప్రతి విషయం నిహారికనే టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -