Sakshi Vaidya: డైరెక్టర్ చేతిలో లాక్ అవడంతో అవకాశాలను కోల్పోతున్న కొత్త హీరోయిన్?

Sakshi Vaidya: సాధారణంగా కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే హీరోయిన్స్ వారికి ఇండస్ట్రీలో అవకాశం రావడం కోసం దర్శక నిర్మాతలు పెట్టే కండిషన్లకు ఒప్పుకొని చాలా తక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకొని ఇండస్ట్రీలోకి వస్తారు.ఈ క్రమంలోనే కొందరు ఒక సినిమాలో అవకాశమిస్తే తమ తదుపరి సినిమాలో కూడా నటించాలని అగ్రిమెంట్ కుదుర్చుకుంటారు. అలాగే తమ సినిమా పూర్తి అయ్యేవరకు ఇతర సినిమాలకు కూడా కమిట్ కాకూడదంటూ అగ్రిమెంట్ రాయించుకుంటారు.

ఈ విధంగా కొందరి దర్శకుల చేతిలో బంది అయినటువంటి హీరోయిన్స్ వారికి మంచి మంచి అవకాశాలు వస్తున్నా కానీ ఆ అగ్రిమెంట్ కారణంగా అవకాశాలను కోల్పోవలసి వస్తుంది. ఈ క్రమంలోనే ఇలాంటి అవకాశాలని నటి సాక్షి వైద్య కోల్పోతున్నారని చెప్పాలి.ఈమె అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏజెంట్ సినిమా కోసం హీరోయిన్ గా నటిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది నిర్మాతలు ఈమెను ఆప్షన్ గా ఎంచుకున్నారని తెలుస్తుంది.
అయితే పెద్ద పెద్ద బ్యానర్లలో కోటి రూపాయల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినప్పటికీ ఈమె అవకాశాలను అందుకోలేక పోతుంది. ఏజెంట్ సినిమా పూర్తి అయ్యేవరకు తను ఇతర సినిమాలు చేయకూడదనే అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమా విడుదలైన తర్వాత కూడా తాను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తను తదుపరి చేయబోయే సినిమా మాత్రమే చేయాలని అగ్రిమెంట్ ఉండటం వల్లే తాను మంచి అవకాశాలను కోల్పోతుందని తెలుస్తోంది.ప్రస్తుతం ఈమె ఏజెంట్ సినిమా కోసం 30 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకుంటున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఆ డైరెక్టర్ చేతిలో బందీ అయిన సాక్షి వైద్య మంచి అవకాశాలను కోల్పోతుందని ఇండస్ట్రీ టాక్.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -